Shri Krishna in Dream:  మనం రోజూ రకరకాల కలలు కంటూ ఉంటాం. కోటీశ్వరుడు అయిపోయినట్లు, జాబ్ వచ్చినట్లు, నచ్చిన అమ్మాయితో పెళ్లైయినట్లు ఇలా చాలా రకాల డ్రీమ్స్ కంటాం. కలలలో మనం చాలా రకాల విషయాలు చూస్తాం. ఇవి మంచైనా కావచ్చు లేదా చెడైనా అవ్వచ్చు. ఈ కలలకు సంబంధించి స్వప్నశాస్త్రంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి. ఈ రోజు కృష్ణాష్టమి. కాబట్టి శ్రీకృష్ణుడు (Lord Krishna) మన కలలో కనిపిస్తే శుభ సూచకంగా భావిస్తారు. ఈ డ్రీమ్స్ మీ లైఫ్ ను మార్చేయగలవు. శ్రీకృష్ణుడు మీ కలలో ఏ రూపంలో కనిపిస్తే శుభం జరుగుతుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కలలో శ్రీకృష్ణుడు కనిపిస్తే...
>> స్వప్న శాస్త్రం ప్రకారం, శ్రీకృష్ణుడు కలలో కనిపిస్తే.. మీ జీవితం సంతోషంగా ఉంటుందని అర్థం. అంతేకాకుండా మీ కెరీర్ లో ఎన్నో విజయాలు సాధిస్తారు మరియు చాలా అభివృద్ధి చెందుతారు. 
>> శ్రీకృష్ణునికి వేణువు అంటే చాలా ఇష్టం. శ్రీ కృష్ణుడు వేణువు వాయిస్తుంటే గోపికలు నాట్యం చేసేవారు. కలల గ్రంధాల ప్రకారం, కలలో కృష్ణుడు వేణువు వాయిస్తున్నట్లు కనిపిస్తే, అది చాలా శుభప్రదం. మీ జీవితంలో అపారమైన ఆనందం మరియు చాలా డబ్బు రాబోతుందని అర్థం. 
>> శ్రీకృష్ణుడు గోపికలతో కలలో కనిపిస్తే.. మీరు మీ స్నేహితులతో హాయిగా గడపబోతున్నట్లు లెక్క. మిత్రులతో సపోర్టుతో మీ జీవితంలోను దుఃఖాలన్నీ తొలగిపోయి.. ఆనందం వెల్లివిరిస్తుంది. 


Also Read: Mercury Transit 2022: మరో 72 గంటల్లో ఈ 4 రాశుల అదృష్టం మారబోతుంది? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి