Spirutual: హిందూ మతంలో మూడుకోట్లదేవతలు ఉన్నారని నమ్ముతారు. ప్రతిదేవుడికి వారంలో ఒక్కోరోజు ప్రత్యేకమైంది. వివిధ పండుగలు, ప్రత్యేకమైన రోజులు అంకితం చేశారు. ఆ పవిత్రమైన రోజుల్లో భక్తితో పూజాపురస్కారాలు చేస్తారు. భగవంతుడికి ఇష్టమైన ప్రసాదాన్ని సమర్పిస్తారు. ఆ దేవుళ్లకు ఇష్టమైన పూలతో పూజిస్తారు. అయితే, హిందూ పురాణాల ప్రకారం జీడిపప్పును కూడా దేవుళ్లకు సమర్పిస్తారట. దీంతో మనకు పట్టిన దరిద్రం పూర్తిగా తొలగిపోతుందనే నమ్మకం ఉంది. ఈరోజు మనం ఏ దేవుళ్లకు జీడిపప్పును ప్రసాదంగా సమర్పించవచ్చో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీడిపప్పు ఎంతో బలవర్ధకమైన ఆహారం. ఇది ప్రతిఇళ్లలో అందుబాటులో ఉంటుంది.దీని పోషకవిలువల కారణంగా దీని ధర కాస్త ఎక్కువ. అయితే, ఇది పోషకాల పవర్ హౌజ్ మాత్రమే కాదు, పూజలో ప్రసాదంగా కూడా మీ ఇష్టదేవుళ్లకు సమర్పించవచ్చని పండితులు చెబుతున్నారు.


1. ఆదిదేవుడైన వినాయకుడికి జీడిపప్పు సమర్పించవచ్చు. ఈయనకు ఇష్టమైన ప్రసాదం మోదకాలు, లడ్డూలు అని మనందరి తెలుసు. అందుకే వినాయక చవితి వేడుకల్లో వీటిని తప్పకుండా వినాయకుడిని నైవేద్యంగా సమర్పిస్తాం. అయితే, మామూలు రోజుల్లో బుధవారంరోజు విఘ్నేశ్వరుని పూజించేటప్పుడు కూడా జీడిపప్పును నైవేద్యంగా పెట్టవచ్చు. దీంతో వ్యక్తులకు ఉండే గ్రహసంబంధిత దోషాలన్ని తొలగిపోతాయట. ఆ వ్యక్తి కోరినకోర్కెలు గణపతి నెరవేరుస్తాడట. 



2. శివయ్యకు కూడా జీడిపప్పును ప్రసాదంగా సమర్పించడం ఎంతో శుభం. సోమవారం పూజలో ఆయనకు నచ్చిన పూలు, పండ్లతోపాటు జీడిపప్పును కూడా ప్రసాదంగా పెట్టొచ్చు. దీంతో ఆ శివయ్య అనుగ్రహం మీపై ఉంటుంది. మీకు పట్టిన దరిద్రం వదిలిపోతుంది. కానీ, గుర్తుంచుకోండి శివపూజలో ఎట్టిపరిస్థితుల్లో పసుపు, సింధూరం, తులసి వంటివి వాడకూడదు. దీంతో శివయ్యకు ఆగ్రహాం కలుగుతుంది. 


3. అంతేకాదు, సంపదల దేవత లక్ష్మీదేవికి కూడా జీడిపప్పును ప్రసాదంగా సమర్పించవచ్చు. లక్ష్మీపూజలో తెల్లని వస్తువులకు ఎంతో ప్రత్యేక స్థానం ఉంది. తెల్లని పూలు, మిఠాయిలు, ప్రసాదాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరం. అందుకే శుక్రవారం రోజు లక్ష్మీపూజలో జీడిపప్పును ప్రసాదంగా సమర్పించండి. లక్ష్మీదేవి కటాక్షిస్తుంది. ఆర్థిక సంక్షోభం నుంచి కూడా త్వరగా బయటపడతారు. 


ఇదీ చదవండి: Sankatahara Chathurthi 2024: 100 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 4 రాశులవారు నక్కతోకతొక్కినట్టే..!


4. ఆదిశక్తి దుర్గామాత పూజలో కూడా జీడిపప్పు నైవేద్యంగా పెట్టవచ్చు. దుర్గాదేవికి సాధారణంగా ఎర్రనిపూలంటే ఇష్టం. అందుకే దుర్గామాత పూజలో మందారకు ప్రతేక ప్రాముఖ్యత ఉంది. దుర్గామాత పూజలో జీడిపప్పును సమర్పించండి వల్ల శుభఫలితాలు కలుగుతాయి. అమ్మవారు త్వరగా కరుణించి కోరిన కోర్కెలు నెరవేరుస్తుందట..(Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం జ్యోతిష్కులు గ్రహ సంచారం ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)


ఇదీ చదవండి: Today Rasi Phalalu (2024 january 28): ఈరోజు ఈ 8 రాశువారి అదృష్టం సూర్యుడిలా ప్రకాశిస్తుందట.. ఇందులో మీ రాశి ఉందా? చెక్ చేయండి..


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter