Tulasi Vastu Tips: తులసి మొక్కకు రోజూ ఈ వస్తువును సమర్పిస్తే ఇంట్లో ఆర్థిక సమస్యలు దరిచేరవు!
Tulasi Vastu Tips: హిందూ మతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం శ్రీహరి,మహాలక్ష్మి తులసి మొక్కలో నివసిస్తారు. అందుకే తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మిదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని ప్రతీతి.
Tulasi Vastu Tips: హిందూ మతంలో తులసికి చాలా ప్రాముఖ్యత ఉంది. మత విశ్వాసాల ప్రకారం శ్రీహరి,మహాలక్ష్మి తులసి మొక్కలో నివసిస్తారు. అందుకే తులసి మొక్క ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మిదేవి ప్రత్యేక అనుగ్రహం ఉంటుందని ప్రతీతి. మత విశ్వాసాల ప్రకారం ఇంట్లో తులసి మొక్క ఎల్లప్పుడూ ఆనందం, శ్రేయస్సు అని అర్థం.
తులసి మొక్క ఇంట్లో సానుకూల శక్తిని ప్రసరింపజేస్తుంది. ఇలా నిత్యం తులసి మొక్కకు నీరు పోస్తే ఆ ఇంట్లో ఆర్థిక సంక్షోభం ఉండదు. డబ్బు వరద ఉంటుంది. తులసికి ఏ రోజు నైవేద్యాన్ని పెడితే ఐశ్వర్య వర్షం కురుస్తుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
ఇదీ చదవండి: ఇంటిప్రధానద్వారంపై ఈ లోహంతో చేసిన స్వస్తీక్ పెడితే ఆ ఇంటికి అభివృద్ధి ఖాయం..!
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తులసికి నీటిని సమర్పించేటప్పుడు మీరు 'ఓం సుభద్రాయ నమః' అని 11 సార్లు జపించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఆర్థిక సంక్షోభం తొలగిపోతుంది. అలాగే లక్ష్మీదేవి విశేష అనుగ్రహం వల్ల సంపదలు వెల్లివిరుస్తాయి.
ఒక వ్యక్తి ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే, అతను తులసి మొక్కకు క్రమం తప్పకుండా నీటిని అందించాలి. ఇలా చేయడం వల్ల సమస్యలు తొలగిపోతాయి.
మత విశ్వాసాల ప్రకారం శ్రీహరి తులసి సన్నిధి లేకుండా భోగాన్ని అంగీకరించడు. ఈ కారణంగానే తులసిని మనస్పూర్తిగా పూజిస్తే సాక్షాత్ నారాయణుడు తమ ఇంటిని దర్శించడమే కాకుండా దారిద్య్రాన్ని దూరం చేస్తాడని నమ్మకం.
ఇదీ చదవండి: బ్రహ్మ ముహూర్తంలో కనిపించే ఈ కలలు కచ్చితంగా నెరవేరుతాయట..!
తులసికి రోజూ నీళ్ళు నైవేద్యంగా పెడితే ఇంట్లో నుండి ప్రతికూలత శాశ్వతంగా తొలగిపోతుంది. దీంతోపాటు పాజిటివ్ ఎనర్జీ వ్యాపిస్తుంది.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook