Jal Jhulni Ekadashi 2022: హిందూ మతంలో ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి. ఈ ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తిని పూజిస్తారు. భాద్రపద మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశినే జలజుల్ని ఏకాదశి (Jal Jhulni Ekadashi 2022)అంటారు. దీనినే పరివర్తిని లేదా డోల్ గ్యారస్ లేదా పద్మ ఏకాదశి అని రకరకాల పేర్లుతో పిలుస్తారు. ఈ రోజున తల్లి యశోద ఘాట్‌కు పూజలు చేసింది. ఈ జలజుల్ని ఏకాదశి ఎప్పుడు, పూజ ముహూర్తం, విశిష్టత తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జలజుల్ని ఏకాదశి శుభ సమయం 
ఏకాదశి తేదీ ప్రారంభం - 06 సెప్టెంబర్ 2022 ఉదయం 05:54 నుండి
ఏకాదశి తేదీ ముగింపు- 07 సెప్టెంబర్ 2022 ఉదయం 03:04 వరకు
పారణ సమయం- 08 సెప్టెంబర్ ఉదయం 06:02 నుండి 08:33 వరకు


ఉపవాసం యొక్క విశిష్టత
>> జల్జుల్ని ఏకాదశి ఉపవాసం జీవితంలో శ్రేయస్సు, సంపద మరియు కీర్తి ప్రతిష్టలను తెస్తుంది.
>> ఈ రోజున దానధర్మాలు చేయడం వల్ల పుణ్యం లభిస్తుంది.
>> ఈ రోజు ఉపవాసం చేయడమంటే వాజ్‌పేయ యాగం చేయడంతో సమానం.  
>> జలజుల్ని ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా జీవితంలోని అన్ని కష్టాలు తొలగిపోతాయి.


జలజుల్ని ఏకాదశి ప్రాముఖ్యత
శాస్త్రాల ప్రకారం, జల్జుల్ని ఏకాదశి రోజున యోగ నిద్రలో ఉన్న  శ్రీమహావిష్ణువు తనవైపు మార్చుకుంటాడు. అంటే పరివర్తన చెందుతాడు. అందుకే దీనిని పరివర్తిని ఏకాదశి అని పిలుస్తారు. స్కాంద పురాణంలోని వైష్ణవ విభాగంలో ఈ ఏకాదశి యెుక్క మహాత్మ్యం గురించి చెప్పబడింది.  ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండడం వల్ల వాజపేయ యాగానికి సమానమైన ఫలితాలు లభిస్తాయని చెబుతారు. 


Also Read: Jivitputrika Vrat 2022: జీవితపుత్రిక వ్రతం ఎప్పుడు? దీనిని ఎందుకు జరుపుకుంటారు? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook