Jivitputrika Vrat 2022: జీవితపుత్రిక వ్రతాన్ని ప్రతి సంవత్సరం అశ్వినీ మాసంలోని కృష్ణ పక్షంలోని అష్టమి తిథి నాడు ఆచరిస్తారు. ఈ ఉపవాసాన్ని జితియా లేదా జియుతియా అని కూడా అంటారు. ఈ వ్రతంలో జీమూతవాహనుడిని పూజిస్తారు. అయితే ఈ ఉపవాసాన్ని (Jivitputrika Vrat 2022) మంచినీరు కూడా ముట్టుకోకుండా పాటించాలి. తమ బిడ్డల సంతోకరమైన జీవితం కోసం వివాహిత స్త్రీలు ఈ వ్రతాన్ని పాటిస్తారు. జీవిత పుత్రిక వ్రత శుభ ముహూర్తం, పారణ సమయం మెుదలైన విషయాలు గురించి తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జీవితపుత్రిక వ్రతం ఎప్పుడు
పంచాంగం ప్రకారం, అశ్వినీ మాసంలోని కృష్ణ పక్ష అష్టమి తిథి సెప్టెంబర్ 17వ తేదీ మధ్యాహ్నం 02.14 గంటలకు ప్రారంభమై.... సెప్టెంబర్ 18వ తేదీ సాయంత్రం 04.32 గంటల వరకు ఉంటుంది. ఉదయం తిథి ఆధారంగా సెప్టెంబర్ 18 ఆదివారం నాడు జీవితపుత్రిక వ్రతాన్ని జరుపుకుంటారు. 


వ్రత ముహూర్తం 2022
సెప్టెంబర్ 18న ఉదయం 06:34 వరకు సిద్ధియోగం ఉంది. ఈ రోజు శుభ సమయం అంటే అభిజీత్ ముహూర్తం ఉదయం 11.51 నుండి మధ్యాహ్నం 12.40 వరకు. ఉదయం 09.11 నుండి మధ్యాహ్నం 12.15 గంటల వరకు అమృత ముహూర్తము కలదు. అదే సమయంలో మధ్యాహ్నం 01:47 నుండి మధ్యాహ్నం 03:19 వరకు శుభ ముహూర్తం ఉంది.


పారణ సమయం
సెప్టెంబరు 18న జీవితపుత్రిక వ్రతాన్ని ఆచరించే వారు... సెప్టెంబరు 19న పారణ చేయడం ద్వారా ఈ ఉపవాసాన్ని పూర్తి చేస్తారు. ఈ రోజున ఉదయం 06.08 నుండి 07.40 వరకు అమృత కాలం. దీని తరువాత ఉదయం 09.11 నుండి 10.43 వరకు శుభముహూర్తము కలదు.


Also Read: Good Luck Tips: రాత్రి పడుకునే మందు ఈ చిన్న పనిచేస్తే.. మీ అదృష్టం మారిపోవడం పక్కా! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook