Auspicious Dates: శుభముహూర్తాలు ప్రతి నెలలోనూ ఉంటుంటాయి. ఏరోజు మంచిదో కాదో చూసుకుని పనులు చేయడం మంచిది. జూన్ నెలలో ఏరోజు మంచిదో కాదో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ప్రతి నెల ప్రారంభమవుతూనే ఆ నెలలో ఏ రోజు మంచిదో కాదో తెలుసుకుంటుంటారు. ఎందుకంటే పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయని ఓ నమ్మకం. ప్రతినెలలో కొన్ని ప్రత్యేకమైన రోజుల్లోనే పెళ్లిళ్లు, గృహప్రవేశాలు వంటి శుభకార్యాలు చేసుకునేందుకు వీలుంది. రేపట్నించి జూన్ నెల ప్రారంభం కానుంది. జూన్ నెలలో ఏరోజుల్లో ఏ పని చేయవచ్చనేది తెలుసుకుందాం..


హిందూ పంచాంగం ప్రకారం జూన్ నెలలో 12 రోజులు మంచి ముహూర్తాలున్నాయి. జూన్ నెలలో 12 రోజులు పెళ్లి ముహూర్తాలున్నాయి. జూన్‌లో పెళ్లిళ్లు, గృహ ప్రవేశాలు, కొనుగోలు, అమ్మకాలు, నామకరణాలు వంటివి చేయవచ్చు


జూన్ నెలలో శుభముహూర్తాలు


జ్యోతిష్యం ప్రకారం ఈసారి జూన్ నెలలో 12 రోజుల వరకూ పెళ్లిళ్లకు మంచి ముహూర్తం. ఒకవేళ మీరు జూన్ నెలలో పెళ్లిళ్లు చేయాలని అనుకుంటుంటే...1, 5,6,7,8, 9, 10, 11,13,17, 23 మరియు 24 తేజీలు మంచిరోజులని అంటన్నారు. ఒకవేళ కొత్తగా గృహ ప్రవేశాలు చేయాలని భావిస్తుంటే..జూన్ 1, 10, 16, 22 తేదీలు మంచివని అంటున్నారు. పండితుల సలహాతో శుభముహూర్తం నిర్ణయించుకోవల్సి ఉంటుంది.


కొనుగోళ్లు, అమ్మకాలకు


అటు ఇళ్లు, వాహనాలు, ప్లాట్ రిజిస్ట్రేషన్, లావాదేవీలకు జూన్ 8వ తేదీ మంచిది. వీటికోసం జూన్ 4,5,14,15,22,28,29,30 తేదీలు మంచి రోజులని చెబుతున్నారు. ముండన కార్యక్రమాలకు జూన్ 1,2,3,4,9,10,23,24,30 తేదీలు మంచిరోజులుగా చెబుతున్నారు. ఇక నామకరణాల కోసం 1,3,9,10,12,16,19,20,21,22,23,26 తేదీలు మంచి ముహూర్తాలుగా ఉన్నాయి. 


Also read: Saturn Retrograde 2022: శని తిరోగమనం...ఈ 3 రాశుల వారికి అపారమైన ప్రయోజనం!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook