Guru Chandra yuti in Mesh Rashi 2024: ఏప్రిల్ నెలలో కొన్ని గ్రహాలు తమ కదలికలను మార్చుకోబోతున్నాయి. అత్యంత వేగంగా రాశులను మార్చుకునే గ్రహాల్లో చంద్రుడు ఒకరు. మూన్ ఒక రాశి నుండి మరోక రాశిలోకి వెళ్లడానికి రెండున్నర రోజుల సమయం పడుతుంది. ఆస్ట్రాలజీ ప్రకారం, ఏప్రిల్ 09న చైత్ర నవరాత్రులు మెుదలుకానున్నాయి. అదే రోజు ఉదయం 7.32 గంటలకు చంద్రుడు మేషరాశిలోకి ప్రవేశించనున్నాడు. బృహస్పతి ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తున్నాడు. మేషరాశిలో ఈ రెండు శుభగ్రహాల కలయిక వల్ల అరుదైన గజకేసరి రాజయోగం సంభవించబోతుంది. ఇది మూడు రాశుల వారికి ఐశ్వర్యంతోపాటు అదృష్టాన్ని కూడా ఇవ్వబోతుంది. ఆ రాశులు ఏవో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం
ఇదే రాశిలో గజకేసరి యోగం రూపొందుతోంది. దీంతో మీకు మంచి రోజులు రాబోతున్నాయి. నవరాత్రుల్లో మేషరాశి వారికి లక్ కలిసి వస్తుంది. మీకు లైఫ్ పార్టనర్ దొరికే అవకాశం ఉంది. మీ ఆదాయం భారీగా పెరుగుతుంది. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. మీరు కోరుకున్నంత ధనం లభిస్తుంది. బిజినెస్ చేసేవారు ఇంతకముందు చూడని లాభాలను చూస్తారు. 
సింహం
చైత్ర నవరాత్రులలో ఏర్పడబోతున్న గజకేసరి యోగం సింహరాశి వారికి బాగా లాభాలను ఇస్తుంది. మీరు గుడ్ న్యూస్ వింటారు. మీకు సంతానప్రాప్తి కలుగుతుంది. ఫారిన్ కు వెళ్లాలన్న మీ కోరిక నెరవేరుతోంది. మీ కుటుంబంలో సంతోషం తాండవిస్తోంది. ఎంతోకాలంగా ఆగిపోయిన ప్రమోషన్ చివరకు మీకు వస్తుంది. మీరు ఫ్రెండ్స్ తో కలిసి ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది. మీ డ్రీమ్స్ నెరవేరుతాయి. 
కర్కాటకం
కర్కాటక రాశి వారికి గజకేసరి యోగం అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీరు ఫ్యామిలీతో మంచి సమయం గడుపుతారు. మీ లైఫ్ లో సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయి. మీ దాంపత్య జీవితంలో గొడవలు తొలగిపోతాయి. మీ కీర్తి నలుదిక్కులకు వ్యాపిస్తుంది. లైఫ్ పార్టనర్ సపోర్టుతో మీరు ప్రతి పనిని విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు ఆర్థికంగా మంచి పొజిషన్ కు వెళతారు. 


Also Read: Mercury transit 2024: మీన రాశిలో త్రిగ్రాహి యోగం... ఈ 3 రాశులకు లక్కే లక్కు.. లాభాలే లాభాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి