Jupiter Combust 2023 in Telugu: మార్చి 28న అదృష్టాన్ని మరియు ఆనందాన్ని ఇచ్చే దేవగురువు బృహస్పతి తన సొంత రాశి అయిన మీన రాశిలో అస్తమించనున్నాడు. జ్యోతిష్య శాస్త్రంలో ఏ గ్రహం యొక్క అస్తమయం మంచిది కాదు. రీసెంట్ గా  దేవగురు బృహస్పతి అస్తమించాడు. ఏప్రిల్ 27 వరకు గురుడు అస్తవ్యస్తంగా ఉంటాడు. ఈలోపే గురుడు ఏప్రిల్ 22న మేషరాశిలోకి ప్రవేశిస్తాడు. మళ్లీ అదే నెల 27న ఉదయిస్తాడు. గురుడు అస్తమయ సమయంలో  కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషం- బృహస్పతి అస్తమించడం వల్ల మేష రాశి వారి జీవితంలో సంతోషం ఉండదు. మీరు పని ఒత్తిడికి గురవుతారు. అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అదృష్టం మీ వెంట ఉండదు. ఈ సమయంలో మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి. 
సింహ రాశి- గురుగ్రహ  అస్తమయం సింహ రాశి వారికి ఇబ్బందులను కలిగిస్తుంది. ఇంట్లో గొడవలు, వివాదాలు రావచ్చు. మీ కుటుంబ సభ్యులతో సంబంధాలు చెడిపోవచ్చు. మిమ్మల్ని సోమరితనం పట్టిపీడిస్తుంది. లావాదేవీకి సంబంధించి వివాదం ఎదుర్కోవచ్చు.
కుంభం- కుంభ రాశి వారికి గురుగ్రహం అస్తమించడం వల్ల సమస్యలు పెరుగుతాయి. వీరు ఖర్చులు రెట్టింపు అవుతాయి. మీ కుటుంబ సభ్యులతో వివాదాలు వస్తాయి. ఈ సమయంలో అస్సలు పెట్టుబడి పెట్టకండి. 


నివారణలు
** మీ తల్లిదండ్రులను, ఉపాధ్యాయులను గౌరవించి.. వారికి సేవ చేయండి. అంతకాకుండా వారి నుండి ఆశీస్సులు తీసుకోండి. మీరు వారిని దూషించవద్దు, పరుషమైన మాటలు మాట్లాడవద్దు.
** నిపుణుడిని సంప్రదించిన తర్వాత మీరు పుష్పరాగం లేదా బంగారు రత్నాన్ని ధరించడం వల్ల మీకు మేలు  జరుగుతుంది. 


Also Read: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ నాడు ఏడు శుభ యోగాలు.. ఈరోజు ఏ పని చేపట్టినా 3 రెట్లు లాభం.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి