Guru Margi 2023: 500 ఏళ్ల తర్వాత అరుదైన రాజయోగం.. ఈ 3 రాశులకు మంచి రోజులు మెుదలు..
Jupiter direct movement: ఈ నెల చివరిలో దేవగురు బృహస్పతి మేషరాశిలో నేరుగా నడవనున్నాడు. దీని కారణంగా అరుదైన యోగం ఏర్పడుతుంది. దీంతో కొత్త సంవత్సరంలో మూడు రాశులవారు ధనవంతులు కానున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
Benefits of Kuldeepak Rajyog 2023: అష్ట గ్రహాల్లో బృహస్పతి కూడా ఒకటి. పురాణాల ప్రకారం, ఇతడిని దేవతల గురువుగా భావిస్తారు. గ్రహాల కాలానుగుణంగా రాశులను మార్చడం వల్ల శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తున్నాయి. ప్రస్తుతం మేషరాశిలో సంచరిస్తున్న గురుడు.. ఈ నెల చివరిలో అదే రాశిలో ప్రత్యక్షంగా మారనున్నాడు. మేషరాశిలో బృహస్పతి ప్రత్యక్ష కదలిక వల్ల కులదీపక రాజయోగం ఏర్పడుతుంది. దాదాపు 500 ఏళ్ల తర్వాత ఈ అరుదైన యోగం రూపుదిద్దుకుంటుంది. ఈ ప్రత్యేకమైన యోగం వల్ల 2024లో కొన్ని రాశులవారిని అదృష్టం వరించనుంది. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం.
కులదీపక రాజయోగం ఈ 3 రాశులకు వరం
సింహం: కులదీపక రాజయోగం సింహ రాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. నూతన సంవత్సరంలో ఖర్చులు తగ్గి.. ఆదాయం పెరుగుతుంది. మీ కెరీర్ లో ఎదుగుదల ఉంటుంది. నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. జాబ్ సాధించాలనే వారి కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మిథునం: బృహస్పతి చేస్తున్న కులదీపక రాజయోగం మిథున రాశి వారికి చాలా లాభాలను ఇస్తుంది. మీ కెరీర్ లోనే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ జీతం పెరుగుతుంది. బిజినెస్ స్టార్ట్ చేయాలనుకునేవారికి ఇదే మంచి సమయం. ఈ సమయంలో అప్పు ఇవ్వడం కానీ, తీసుకోవడం కానీ చేయకండి. ఏదైనా టూర్ కు వెళ్లే అవకాశం ఉంది.
కుంభం: గురు మార్గి వల్ల ఏర్పడిన కులదీపక రాజయోగం వల్ల కుంభరాశి వారికి గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. మీ ఆదాయం పెరుగుతుంది. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. మీరు వృత్తి, ఉద్యోగ మరియు వ్యాపారాల్లో లాభపడతారు. మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది.
Also Read: Chandra Gochar 2023: మరో 2 రోజుల్లో ధనవంతులు కానున్న రాశులివే..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి