Benefits of Kalatmaka Rajayogam 2023: జాగ్రఫీ ప్రకారం, బుధుడికి ఉపగ్రహం చంద్రుడు. సాధారణంగా చంద్రుడు రెండున్నర రోజుల్లో తన రాశిని మారుస్తాడు. ఈ క్రమంలో వివిధ గ్రహాలతో పొత్తులు పెట్టుకుంటాడు. మనస్సుకు కారకుడైన చంద్రుడు ఈ రోజు(డిసెంబర్ 8) రాత్రి 9:35 గంటలకు తులారాశిలోకి ప్రవేశించనున్నాడు. శుక్ర గ్రహం ఇప్పటికే అదే రాశిలో సంచరిస్తోంది. తులరాశిలో ఈ రెండు గ్రహాల కలయిక వల్ల కలాత్మక రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం ఏయే రాశులవారికి మేలు చేస్తుందో తెలుసుకుందాం.
తుల: ఇదే రాశిలో చంద్రుడు మరియు శుక్రుడు కలయిక ఏర్పడబోతుంది. దీని కారణంగా మీ వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. మీకు గోల్డెన్ డేస్ మెుదలవుతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్ తోపాటు ప్రమోషన్ కూడా లభిస్తుంది బిజినెస్ చేసేవారు భారీగా లాభాలను పొందుతారు.
కర్కాటకం: కళాత్మక రాజయోగం కర్కాటక రాశి వారికి ఊహించని లాభాలను ఇస్తుంది. పైగా కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు. దీంతో మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేస్తారు. ఈ రాశి వారు విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం ఉంది. మీరు స్థిర చరాస్థులు పొందుతారు. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది.
మకరం: కళాత్మక యోగం మకర రాశి వారికి ఎంతో మేలు చేస్తుంది. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో విజయం సాధిస్తారు. మీ కెరీర్ మునుపటి కంటే బాగుంటుంది. మీ శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. భార్య, భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. వ్యాపారస్తులు భారీగా లాభపడతారు.
Also Read: Budh Vakri 2023: డిసెంబరు 13 నుంచి బుధుడి రివర్స్ కదలిక.. ఈ 3 రాశులకు కష్టాలే ఇక..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి