Guru Mahadasha Effect: గ్రహాలు కాలానుగుణంగా తమ రాశులను ఛేంజ్ చేస్తాయి. తద్వారా శుభ లేదా అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. ప్రతి గ్రహానికి మహాదశ ఉంటుంది. జాతకంలో గ్రహాల స్థానాలను బట్టి ఈ మహాదశ శుభ మరియు అశుభ ఫలితాలను ఇస్తుంది. ఇప్పుడు మనం గురు మహాదశ గురించి చెప్పుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

దేవగురు బృహస్పతి యెుక్క మహాదశ 16 సంవత్సరాలపాటు ఉంటుంది. ఏ వ్యక్తి జాతకంలో గురుడు బలమైన స్థానంలో ఉంటాడో అతనికి సంపదకు, గౌరవానికి లోటు ఉండదు. ఆ మనిషి 16 ఏళ్లు రాజులా బతుకుతాడు. ఒక వేళ ఎవరి జాతకంలో గురుడు బలహీన స్థితిలో ఉంటాడో, వారు బృహస్పతి మహాదశ సమయంలో చాలా సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది. 


గురు మహాదశ శుభ ప్రభావం 
ఏ వ్యక్తి జాతకంలో గురుడు శుభ స్థానంలో ఉంటాడో వారి కెరీర్ అద్భుతంగా ఉంటుంది. వీరి జీవితంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. డబ్బుకు లోటు ఉండదు. వీరు చాలా జ్ఞానాన్ని కలిగి ఉంటారు. అంతేకాకుండా దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. మీరు ఎంతో పురోభివృద్ధి  సాధిస్తారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీలో దాన గుణం కూడా ఉంటుంది. 
అశుభ ప్రభావం
మరోవైపు ఎవరి జాతకంలో బృహస్పతి అశుభ స్థానంలో ఉంటాడో వారు కెరీర్ లో చాలా ఇబ్బందులను ఎదుర్కోవల్సి ఉంటుంది. వీరికి దేవుడిపై నమ్మకం ఉండదు. వీరు అనారోగ్యం బారిన పడతారు. పెళ్లికి అన్నీ అడ్డంకులే వస్తాయి. దాంపత్య సుఖం ఉండదు. సంతానప్రాప్తి కలుగదు.  


Also Read: Jupiter Transit 2023: 12 ఏళ్ల తరువాత గురు గోచారం, ఆ మూడు రాశులపై డబ్బుల వర్షం


పరిహారం
జాతకంలో బృహస్పతి బలహీనంగా ఉంటే.. అతడు బలపడటానికి కొన్ని చర్యలు తీసుకోవాలి. ఇందుకోసం గురువారం ఉపవాసం ఉండి ఆ రోజు చేసిన ఏదైనా తింటే మంచిది. ఈరోజు బృహస్పతితోపాటు విష్ణువును కూడా పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది.  గురువారం అరటి చెట్టుకు పూజ చేయడం, పేదలకు దానం చేయడం మీకు లాభిస్తుంది. 


Also Read: Sun Transit 2023: 'పితృ దోష యోగం' చేసిన సూర్యుడు-రాహువు.. రాబోయే నెల రోజులుపాటు ఈ 3 రాశులకు ఇబ్బందులు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook