Guru Rahu Yuti 2023 effect : జూలై మొదలైంది. గ్రహాల సంచారం పరంగా ఈ నెల చాలా ముఖ్యమైనది. ఈ మాసంలోనే మేషరాశిలో గురు, రాహువు కలయిక ఏర్పడబోతుంది. దీని కారణంగా అశుభకరమైన గురు చండాల యోగం రూపొందుతుంది. దీని ప్రభావం ప్రజలందరిపై ప్రతికూల ప్రభావం చూపనుంది. ఈ యోగ సమయంలో ముఖ్యంగా నాలుగు రాశులవారు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. ఆ రాశులు ఏవో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ 4 రాశులవారు జాగ్రత్త
మేషరాశి
గురు చండాల యోగం మేష రాశి వారికి  అశుభం. ఎందుకంటే ఈ రాశిలోనే వీరి కూటమి ఏర్పడబోతుంది. దీని కారణంగా ఈ సమయంలో మీరు సరైన నిర్ణయాలు తీసుకోలేరు. పని ప్రదేశాల్లో జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకు మరింత పని పెరుగుతుంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోండి. ఈ నెలలో ఆదాయం బాగానే ఉంటుంది. 
కుంభ రాశి
జూలై నెలలో కుంభరాశి వారు చాలా ఇబ్బందులకు గురవుతారు. మీ వైవాహిక జీవితంలో గొడవలు వచ్చే అవకాశం ఉంది. ఇతరుల విషయాల్లో అసలు జోక్యం చేసుకోవద్దు. మీ ఖర్చులను అదుపులో పెట్టుకోండి. మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. యోగా, ప్రాణాయామం చేయడం మంచిది. మీరు భారీగా డబ్బు నష్టపోతారు. 
సింహరాశి 
సింహ రాశి వారు జూలై నెలలో జాగ్ర‌త్త‌గా ఉండాలి. మీ మాటతీరును, కోపాన్ని అదుపులో ఉంచుకోండి. అనవసరమైన వాదనలకు దిగకండి. మీ ఆరోగ్యం ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంది. తోబుట్టువులతో సంబంధాలు మెరుగుపడతాయి. మీ పని చెడిపోయే అవకాశం ఉంది. 


Also Read: Mangal Gochar 2023: ఈ రోజు నుండి ఈ 4 రాశులకు మహార్దశ.. ఇందులో మీరున్నారా?


వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారికి జులై నెల అస్సలు కలిసిరాదు. మీరు భారీగా డబ్బు నష్టపోయే అవకాశం ఉంది. మీ ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది. మీకు ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సపోర్టు లభించదు. కోర్టు కేసుల్లో ఓడిపోయే అవకాశం ఉంది. చర్చలకు దూరంగా ఉంటే మీకే మంచిది. 


Also Read: Shani Retrograde 2023: తిరోగమనంలో శని.. ఈ 3 రాశులకు ఊహించనంత మనీ..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook