Jupiter Retrograde 2023 in September: గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తాయి. దేవగురు బృహస్పతి సెప్టెంబరు 04, సోమవారం నాడు మేషరాశిలో తిరోగమనం(Jupiter Retrograde 2023 in Aries) చేయనున్నాడు. అదే స్థితిలో డిసెంబర్ 31 వరకు ఉండనున్నాడు. గురుడు రివర్స్ కదలిక 118 రోజులుపాటు ఉంటుంది. ఇదే సమయంలో తిరోగమన బృహస్పతి వ్యతిరేక రాజయోగం చేస్తున్నాడు. బృహస్పతి వ్యతిరేక కదలిక ఏయే రాశులవారికి లాభాలను ఇస్తుందో తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తులారాశి
గురుడు వ్యతిరేక కదలిక తులరాశి వారికి శుభఫలితాలను ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగులకు ప్రమోషన్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు మంచి లాభాలను పొందుతారు. మీ కెరీర్ లో వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. మీ జీవితంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీరు ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. 
సింహరాశి
గురుడు రివర్స్ కదలిక వల్ల సింహరాశి వారి అదృష్టం పెరుగుతుంది. మీరు కష్టాల నుండి విముక్తి పొందుతారు. మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీకు ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి పెరుగుతుంది. మీ కుటుంబంలో ఆనందం వెల్లివిరిస్తుంది. మీకు ఆకస్మిక ధనలాభం ఉంటుంది. సమయానికి మీ పనులు పూర్తవుతాయి. 
మిధునరాశి
బృహస్పతి తిరోగమనం మిథునరాశి వారికి మంచి ఫలితాలను ఇస్తుంది. పెండింగ్ లో ఉన్న మీ పనులన్నీ పూర్తవుతాయి. మీరు ఆర్థికంగా లాభపడతారు. మీ వైవాహిక జీవితం బాగుంటుంది. మీ ఆదాయం పెరుగుతుంది. మీరు రుణ విముక్తి పొందుతారు. వ్యతిరేక రాజయోగం వల్ల లవ్ సక్సెస్ అవుతుంది. 


Also Read: Saturn Direct Movement: సెప్టెంబరులో నేరుగా నడవనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook