Saturn Direct Movement: సెప్టెంబరులో నేరుగా నడవనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

Saturn Direct Movement: శనిదేవుడు రెండున్నరేళ్లకొకసారి తన రాశిని మారుస్తాడు. త్వరలో శనగ్రహం నేరుగా నడవనుంది. శని కదలిక వల్ల ఏయే రాశులవారు ప్రయోజనం పొందబోతున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 5, 2023, 11:46 AM IST
Saturn Direct Movement: సెప్టెంబరులో నేరుగా నడవనున్న శనిదేవుడు.. ఈ 3 రాశులవారు ధనవంతులు అవ్వడం పక్కా..

Shani Margi 2023 effect: ఆస్ట్రాలజీలో శనిదేవుడిని కర్మదాత, న్యాయాధీశుడు అని పిలుస్తారు.  ఇతడి దయ ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడిగా మారతాడు. శనిదేవుడి చెడు దృష్టి పడిందంటే బిలియనీర్ కూడా బిచ్చగాడిగా మారతాడు.  గ్రహాలన్నింటిలో నెమ్మదిగా కదిలే గ్రహం శనిదేవుడు. 30 ఏళ్ల తర్వాత శనిదేవుడు తన సొంత రాశి అయిన కుంభరాశిలో సంచరిస్తుంది. సెప్టెంబరులో శని గ్రహం తన గమనాన్ని మార్చబోతుంది. శని ప్రత్యక్ష సంచారం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు. ఆ అదృష్ట రాశులు ఏవో తెలుసుకుందాం. 

శనిదేవుడి కదలిక ఈ రాశులకు వరం
మకరరాశి
శని ప్రత్యక్ష సంచారం మకరరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే శని గ్రహం మీ యెుక్క సంపదల ఇంట్లో సంచరించనున్నాడు. దీంతో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మీరు ఊహించని లాభాలను పొందుతారు. నిలిచిపోయిన పనులు మెుదలవుతాయి. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. 
మిధునరాశి
మీ రాశి యెుక్క జాతకంలోని అదృష్ట ఇంట్లో శనిదేవుడు సంచరించనున్నాడు. ఇతడి యెుక్క ప్రత్యక్ష సంచారం మిథునరాశి వారి జీవితంలోకి అదృష్టాన్ని తీసుకురాబోతుంది. మీరు గతంలో పెట్టిన పెట్టుబడులు ద్వారా ప్రయోజనం పొందుతారు. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి వస్తుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. 
తులారాశి
శనిదేవుడి కదలిక తులరాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ రాశి యెుక్క ఐదో ఇంట్లో శని గ్రహం సంచరించనున్నాడు. దీంతో మీ కోరికలన్నీ నెరవేరుతాయి. మీకు సంతానప్రాప్తి కలిగే అవకాశం ఉంది. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. జాబ్ చేసేవారికి పదోన్నతి లభిస్తుంది. మీరు లగ్జరీ లైఫ్ ను లీడ్ చేసే అవకాశం ఉంది.

Also Read: Jupiter transit 2023: నవంబర్ వరకు ఈ రాశులకు డబ్బే డబ్బు.. లాభాలే లాభాలు.. మీ రాశి ఉందా?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News