Jupiter Transit 2023: హిందువులు దేవతలకు గురువుగా బృహస్పతిని భావిస్తారు. ఆస్ట్రాలజీలో బృహస్పతి అదృష్టాన్ని ప్రసాదించే గ్రహంగా పరిగణిస్తారు. మీ జాతకంలో బృహస్పతి స్థానాన్ని బట్టే మీ వివాహం ఆధారపడుతుంది. 2023 సంవత్సరంలో గురు గ్రహ స్థానంలో పెను మార్పులు రానున్నాయి. మార్చిలో బృహస్పతి అస్తమించనుంది. అనంతరం గురుడు ఉదయిస్తాడు. ఏప్రిల్ 22, 2023న దేవగురు తన సొంత రాశి అయిన మీనరాశిని విడిచిపెట్టి మేషరాశిలోకి ప్రవేశిస్తుంది. జ్యూపిటర్ సంచారం మెుత్తం 12 రాశులవారిపై ప్రభావాన్ని చూపుతుంది. దీని గోచారం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురు సంచారం ఈ రాశులకు వరం


మేషం (Aries): గురు సంచారం మేష రాశి వారికి చాలా ప్రయోజనాలను ఇస్తుంది. దేవగురువు బృహస్పతి రాశిని మార్చి ఇదే రాశిలోకి ప్రవేశిస్తాడు. గురు సంచారం ఈ రాశివారికి శుభఫలితాలను ఇస్తుంది. మీరు ఏ పని చేపట్టినా దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు. ఉద్యోగులకు ప్రమోషన్ వస్తుంది. అదృష్టం పెరుగుతుంది. బంధు మిత్రుల సపోర్టు లభిస్తుంది. 
మిథునరాశి (Gemini): మిథున రాశి వారికి బృహస్పతి రాశి మార్పు చాలా మేలు చేస్తుంది. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. నిరుద్యోగులకు పెద్ద ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. జాబ్ మారే అవకాశం ఉంది. మీరు వ్యాపారంలో భారీ లాభాలను ఆర్జిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
సింహ రాశి (Leo): సింహ రాశి వారికి దేవగురువు బృహస్పతి సంచారం అదృష్టం కలిగిస్తుంది. మీరు శ్రమకు తగ్గ ఫలితాలను పొందుతారు. పనుల్లో విజయం ఉంటుంది. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. 


Also Read: Budh Uday 2023: మరో 5 రోజుల తర్వాత ఉదయించబోతున్న బుధుడు... ఈ రాశులవారికి ప్రత్యేక ప్రయోజనాలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U    


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.