Guru Gochar 2023: గ్రహాలు నిర్ణీత వ్యవధిలో రాశులను మార్చడం ద్వారా శుభ మరియు అశుభ యోగాలను ఏర్పరుస్తాయి. మరో ఐదు రోజుల్లో అంటే ఏప్రిల్ 22న బృహస్పతి మేషరాశిలో ప్రవేశించనున్నాడు. దీని కారణంగా అఖండ సామాజ్ర్య రాజయోగం ఏర్పడనుంది. అక్షయ తృతీయ నాడు ఈ శుభ యాదృచ్చికం జరగబోతుంది. ఈ అఖండ సామ్రాజ్య రాజయోగం వల్ల మూడు రాశులవారు ప్రయోజనం పొందనున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సింహ రాశి
అవిచ్ఛిన్న సామ్రాజ్య రాజయోగం ఈ రాశుల వారికి అనుకూలంగా ఉంటుంది. మీ అదృష్ట స్థానంలో బృహస్పతి ప్రయాణిస్తున్నాడు. ఈ సమయంలో మీ కోరికలు నెరవేరుతాయి. కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. సంతానప్రాప్తి కలుగుతుంది. మీరు పని నిమిత్తం ప్రయాణం చేసే అవకాశం ఉంది. 
మిధున రాశి
అఖండ సామాజ్ర్య రాజయోగం మిథున రాశి వారికి కలిసి వస్తుంది. ఈ రాశికి చెందిన ఆదాయ గృహంలో బృహస్పతి సంచరించనున్నాడు. మీరు కెరీర్ లో పురోగతి సాధిస్తారు. మీ ఆదాయం డబల్ అవుతుంది. కొత్త ఆదాయ  మార్గాలు తెరుచుకున్నాయి. స్టాక్ మార్కెట్, బెట్టింగ్ మరియు లాటరీలో డబ్బు పెట్టుబడి పెట్టడం వల్ల ప్రయోజనం పొందుతారు. విదేశాల్లో చదువుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. 


Also Read: Jupiter Mahadasha: మీ జాతకంలో గురు మహాదశ ఉందా? అయితే మీరు 19 ఏళ్లు కింగ్ లా బతుకుతారు..


మకరరాశి
బృహస్పతి సంచారం ద్వారా ఏర్పడిన అఖండ సామ్రాజ్య రాజయోగం మకర రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే బృహస్పతి మీ జాతకంలో నాల్గవ ఇంట్లో సంచరించబోతున్నాడు. మీరు ఏదైనా ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. ఆఫీసులో మీరు కొత్త బాధ్యతలను తీసుకుంటారు. పెళ్లి ఫిక్స్ అయ్యే ఛాన్స్ ఉంది. 


Also Read: Sun Transit 2023: 'పితృ దోష యోగం' చేసిన సూర్యుడు-రాహువు.. రాబోయే నెల రోజులుపాటు ఈ 3 రాశులకు ఇబ్బందులు.. 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook