Jupiter Transit 2023: గ్రహాలు నిర్ణీత సమయంలో వేర్వేరు రాశుల్లో ప్రవేశిస్తుంటాయి.  అదే విధంగా 12 ఏళ్ల తరువాత గురుడు రాశి మారనున్నాడు. గురువు మేషరాశిలో ప్రవేశించడంతో అప్పటికే ఆ రాశిలో ఉన్న సూర్యుడు, రాహువులతో కలిసి యుతి ఏర్పర్చనున్నాయి. ఫలితంగా 3 రాశులపై వద్దంటే కనకవర్షం కురవనుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

గురువు ఈసారి మేష రాశిలో ప్రవేశిస్తుండటం చాలా ప్రత్యేకత కలిగింది. ఎందుకంటే 12 ఏళ్ల తరువాత జరుగుతున్న పరిణామమిది. ఏప్రిల్ 14వ తేదీ నుంచి సూర్య., రాహువుల గ్రహణ దోషం ప్రారంభమైంది. దీనికి అశుభంగా భావిస్తారు. కానీ ఇదే గురుడి మేష రాశిలో ప్రవేశం సందర్భంగా ఏర్పర్చనున్న యుతితో 3 రాశులవారిపై కలలో కూడా ఊహించనివిధంగా ధనవర్షం కురవనుంది. 


కర్కాటక రాశి


సూర్యుడు, గురుడు, రాహువు యుతి కర్కాటక రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. గోచారం కుండలి కర్మపాదంలో ఈ యుతి ఏర్పడనుంది. వ్యాపారులకు ఆర్ధికంగా లాభాలు ఆర్జించే సమయమిది. ఇక అదృష్టం కూడా తోడవుతుంది. కొత్త ఉద్యోగాల లభించే అవకాశాలున్నాయి.  పనిచేసేచోట ప్రశంసలు లభిస్తాయి. అధికారులు మీ పనితీరును ప్రశంసిస్తారు. కెరీర్‌లో కొత్త అవకాశాలు లభిస్తాయి. కర్కాటక రాశివారికి శని దోషం నడుస్తోంది ఇప్పుడు. అందుకే శని దేవుడిని విధి విధానాలతో పూజలు చేయాలి. ఆరోగ్యం బాగుంటుంది.


సింహ రాశి


సూర్య, రాహు, గురు గ్రహాల సంయోగం సింహ రాశి జాతకులపై చాలా అద్భుతంగా ఉండనుంది. ఈ యుతి అదృష్ఠ స్థానంలో ఏర్పడనుంది. దాంతో అంతా అనుకూలంగా ఉంటుంది. కెరీర్ విషయంలో సక్సెస్ ఉంటుంది. ఆత్మ విశ్వాసం పెరుగుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యపరంగా ఏ విధమైన సమస్యలు ఉండవు.
 


మేష రాశి


సూర్యుడు, రాహువు గురుడు కలిసి ఏర్పర్చనున్న యుతి మేష రాశి జాతకులకు అత్యంత లాభదాయకం కానుంది. మేష రాశిలో గోచారం కుండలిలో లగ్నపాదంలో ఉంటుంది. జీవితంలో కీలకమైన నిర్ణయాలు తీసుకోగలరు. కెరీర్ విషయంలో లభించే మంచి అవకాశాలు మీ జీవితాన్ని మలుపు తిప్పుతాయి. ఉద్యోగులకు పదోన్నతి, ఇంక్రిమెంట్లు లభిస్తాయి. పెళ్లి సంబంధాలు ఖాయమౌతాయి. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ఆర్ధిక పరిస్థితి పూర్తిగా బలంగా ఉంటుంది. ఏ విధమైన ఇబ్బందులుండవు.


Also read: Saturn Transit 2023: శని శక్తిమంతుడు కావడంతో ఆ మూడు రాశులపై కనకవర్షం



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook