Devaguru transit 2024: ఏప్రిల్ నెలాఖరులో దేవగురు బృహస్పతి తన రాశిని మార్చబోతున్నాడు. ఇప్పటి వరకు మేషరాశిలో సంచరిస్తున్న గురుడు ఏప్రిల్ 29న వృషభరాశిలోకి ప్రవేశించనున్నాడు. పుష్కర కాలం తర్వాత దేవగురు వృషభరాశి ప్రవేశం చేయనున్నాడు. సాధారణంగా జ్యూపిటర్ ఏడాదికొకసారి తన రాశిని మారుస్తుంది. గురుడు యెుక్క ఈ రాశి మార్పు కారణంగా మూడు రాశులవారు నక్కతోక తొక్కబోతున్నారు. ఇక నుంచి వీరు ఏది చేసినా అది లాభదాయకంగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వృషభం
ఇదే రాశిలోకి దేవగురు బృహస్పతి వెళ్లనున్నాడు.12 ఏళ్ల తర్వాత జరగబోతున్న ఈ సంచారం కారణంగా వృషభరాశి వారు ఎన్నో బెనిఫిట్స్ పొందబోతున్నారు. వీరు ఆర్థిక పరిస్థితి మునుపటి కంటే బాగుంటుంది. వీరిని లక్ వరిస్తుంది. మీరు తలపెట్టిన ప్రతి పని విజయవంతం అవుతుంది. పోటీపరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు విజయం సాధిస్తారు. పెళ్లికాని యువతీయువకులకు వివాహ సంబంధాలు వస్తాయి. 
మకరరాశి
బృహస్పతి రాశి మార్పు మకరరాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. మీ పెళ్లి కుదురుతుంది. మీ ఇంట్లో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. ఏప్రిల్ 29 తర్వాత మీ వ్యాపారం వృద్ధి చెందుతుంది. సంతానం లేని దంపతులకు సంతానం కలుగుతుంది. మీరు ఆర్థికంగా పురోగమిస్తారు. మీరు అప్పుల ఊబి నుండి బయటపడతారు. 
వృశ్చికరాశి
గురుడు యెుక్క రాశి మార్పు వృశ్చిక రాశి వారికి అనుకూల ఫలితాలను ఇస్తుంది. ఎంతోకాలంగా ఎదురూచుస్తున్న ప్రమోషన్ వస్తుంది. కష్టపడి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పకుండా విజయం సాధిస్తారు. ఉద్యోగులకు హైక్ వస్తుంది. ఇప్పటి వరకు నష్టాల్లో నడిచిన వ్యాపారం లాభాలు బాట పడుతుంది. అప్పుగా ఇచ్చిన డబ్బు తిరిగి ఇస్తారు. 
(Disclaimer:  ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు ఇంటర్నెట్ సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.)


Also Read: Pocket Vastu: ఈ 3 వస్తువులను మీ జేబులో పెట్టుకోండి.. ప్రతి పనిలో విజయం సాధిస్తారు


Also Read: Astrology - Raja Yoga: 12 యేళ్ల తర్వాత గజలక్ష్మీ యోగము.. ఈ రాశుల వారి ఇంట్లో ధనలక్ష్మీ తాండవమే..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter