Jwalamukhi Yog: వచ్చే నెల 05న జ్వాలాముఖి యోగం.. పొరపాటున కూడా ఈ పని చేయకండి..
Jwalamukhi Yog effect: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని పవర్ పుల్ యోగాలు గురించి చెప్పబడ్డాయి. అటువంటి వాటిల్లో జ్వాలాముఖి యోగం ఒకటి. ఇది అశుభకరమైన యోగం. ఈ యోగ సమయంలో చేసే పనులు మీ చెడు ఫలితాలను ఇవ్వచ్చు.
When is Jwalamukhi Yog: ఏదైనా పని లేదా వ్యాపారం లేదా శుభకార్యం చేసే ముందు తిథి, శుభ ముహూర్తం చూస్తాం. ప్రతి వ్యక్తి తాను మెుదలుపెట్టిన పనిని విజయవంతంగా పూర్తి చేయాలని అనుకుంటాడు. ఆస్ట్రాలజీలో కొన్ని యోగాలు గురించి చెప్పబడ్డాయి. ఇందులో మంచి, చెడు రెండూ ఉన్నాయి. ఇలాంటి అశుభ యోగాల్లో జ్వాలాముఖి యోగం కూడా ఒకటి. ఈ యోగంలో ఏ పని చేసినా అది మంచి ఫలితాలను ఇవ్వదు. అయితే ఈయోగానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. శత్రువులపై విజయం సాధించేందుకు ఈ యోగం శుభప్రదమని చెబుతారు. అయితే ఈ సారి జ్వాలాముఖి యోగం ఎప్పుడు ఏర్పడబోతుందో తెలుసుకుందాం.
జ్వాలాముఖి యోగం ఎప్పుడు?
హిందూ క్యాలెండర్ ప్రకారం, ఈసారి జ్వాలాముఖి యోగం జూన్ 5 తెల్లవారుజామున 3.23 గంటలకు ప్రారంభమై... ఉదయం 6.39 గంటలకు ముగుస్తుంది.
ఏయే సందర్భాల్లో ఏర్పడుతుంది?
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, ప్రతిపద తిథి రోజున మూల నక్షత్రం వచ్చినప్పుడు జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. పంచమి తిథి నాడు భరణి నక్షత్రం వస్తే జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. కృత్తిక నక్షత్రం అష్టమి తిథి నాడు వస్తే జ్వాలాముఖి యోగం రూపొందుతుంది. నవమి తిథి నాడు రోహిణి నక్షత్రం వస్తే జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. దశమి తిథి నాడు ఆశ్లేష నక్షత్రం వస్తే జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది.
జ్వాలాముఖి యోగం ప్రతికూల ప్రభావాలు
** జ్వాలాముఖి యోగంలో పుట్టిన బిడ్డ జీవితాంతం అనేక సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది.
** ఈ యోగంలో వివాహం చేసుకున్నవారి వైవాహిక జీవితం కష్టాలతో నిండి ఉంటుంది.
** జ్వాలాముఖి యోగంలో విత్తనాలు నాటడం వల్ల పంట సరిగా రాదు.
** ఈ యోగంలో మీరు అనారోగ్యానికి గురైనట్లయితే.. మీకు చాలా కాలం పాటు ఆ వ్యాధి తగ్గదు.
Also Read: Budh Gochar 2023: జూన్ లో బుధుడి సంచారంతో ఈ రాశులకు సమస్యలు.. ఇందులో మీరున్నారా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి