Jyeshtha Amavasya 2023: జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంటుంది. ఈరోజున చేసే స్నానం, దానం మరియు పూజలు మీకు మంచి ఫలితాలను ఇస్తాయి. ఈ ఏడాది జ్యేష్ఠ అమావాస్య మే 19న రానుంది. ఇదే రోజున వట్ సావిత్రి వత్రం, శని జయంతిని కూడా జరుపుకోనున్నారు. ఈరోజున కొన్ని ప్రత్యేక వస్తువులను దానం చేయడం వల్ల మీకు పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది. అంతేకాకుండా శని, బుధుడు వంటి ఏడు గ్రహాల ఆశీర్వాదం లభించనుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

జ్యేష్ఠ అమావాస్య రోజున స్నానం, దానం మరియు తర్పణానికి విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ఈరోజున 7 ప్రత్యేక వస్తువులను (బియ్యం, గోధుమలు, బార్లీ, మొక్కజొన్న, శనగలు, మూంగ్ పప్పు మరియు నువ్వులు) దానం చేయడం వల్ల మీ పూర్వీకులు సంతోషించి ఐశ్వర్యంతోపాటు అదృష్టాన్ని కూడా ఇస్తారు. అంతేకాకుండా 7 గ్రహాల వల్ల కలిగే దుష్ఫలితాల భయం తొలగిపోతుంది. 


శని మరియు సూర్యుడిని బలపరచడానికి గోధుమలు మరియు నల్ల శనగలను దానం చేయాలి. తెల్ల నువ్వులను దానం చేయడం వల్ల శుక్రుడు బలపడతాడు. పప్పును దానం చేయడం ద్వారా బుధ గ్రహం స్ట్రాంగ్ అవుతుంది. చంద్రుని అనుగ్రహం కోసం అన్నం దానం చేస్తారు. బార్లీ, మసూర్ దాల్ దానం చేయడం వల్ల అంగారకుడి అనుగ్రహం లభిస్తుంది. 


Also Read: Gajkesari Yoga 2023: నేటి నుండి ఈ 3 రాశుల సుడి తిరగనుంది.. ఇందులో మీ రాశి ఉందా? 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook