Kark Sankranti 2022: సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించడాన్నే కర్క సంక్రాంతి అంటారు. ఈ ఏడాది కర్క సంక్రాంతిని (Kark Sankranti 2022) 16 జూలై 2022 శనివారం జరుపుకుంటారు. ఈ సమయంలోనే సూర్యుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయానికి మారుతాడు. దీని కారణంగా పగలు తక్కువగా, రాత్రి సమయం ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక ఖగోళ దృగ్విషయం. ఇది ప్రతి ఆరు నెలలకొకసారి మారుతూ ఉంటుంది. అదే మకర సంక్రాంతిలో అయితే పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటుంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కర్క సంక్రాంతి ప్రభావం
కర్క సంక్రాంతి సమయానికి రుతుపవనాలు రావడం ప్రారంభిస్తాయి. సూర్యభగవానుడు ఉత్తరాయణం నుండి దక్షిణాయానానికి మారినప్పుడు వాతావరణంలో మార్పు వస్తుంది. ఈ సమయంలో ప్రతికూల శక్తుల ప్రభావం పెరుగుతుందని నమ్ముతారు. ఈ సమయంలో శుభకార్యాలు జరగవు. 


ఈ పని తప్పక చేయండి
దేవశయని ఏకాదశి కర్క సంక్రాంతికి ముందు వస్తుంది. చాతుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో శుభకార్యాలన్నీ నిషేధించబడ్డాయి. కర్క సంక్రాంతి నాడు పూర్వీకులను ప్రసన్నం చేసుకునేందుకు పిండ ప్రదానం చేస్తారు. వారి శాంతి కోసం పూజలు జరిపిస్తార. దీని ద్వారా పూర్వీకుల ఆశీస్సులు లభిస్తాయి. మీకు మానసిక, శారీరక బాధలు దూరమవుతాయి.


Also Read: Mauna Panchami 2022: మౌన పంచమి ఎప్పుడు? ఈ వ్రత ప్రాముఖ్యత ఏంటి?



 


స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook