Kartik Amavasya 2022: కార్తీక అమావాస్య ఎప్పుడు? దీని ప్రాముఖ్యత ఏంటి?
Amavasya in October 2022: హిందూమతంలో కార్తీక మాసం అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఏడాది కార్తీక అమావాస్య ఎప్పుడు వస్తుందో తెలుసా.
Kartik Amavasya in October 2022: కార్తీక మాసంలో వచ్చే అమావాస్యను కార్తీక అమావాస్య అంటారు. దీనినే బడి అమావాస్య లేదా దీపావళి అమావాస్య అని కూడా అంటారు. హిందూమతంలో కార్తీక అమావాస్యకు చాలా ప్రాధాన్యత ఉంది. దీపావళి పండుగను కార్తీక అమావాస్య రోజునే జరుపుకుంటారు. ఈ సంవత్సరం కార్తీక అమావాస్య (Kartik Amavasya 2022) 25 అక్టోబర్ 2022న వస్తుంది. బ్రహ్మ పురాణం ప్రకారం, కార్తీక అమావాస్య నాడు లక్ష్మీదేవి భూమిపైకి వస్తుందట. ఈ రోజున పవిత్ర నదిలో స్నానం చేసి దీపాన్ని వదిలితే పుణ్యం వస్తుందని అంటారు. కార్తీక అమావాస్య తేదీ మరియు ప్రాముఖ్యతను తెలుసుకుందాం.
కార్తీక అమావాస్య 2022 తేదీ
హిందూ క్యాలెండర్ ప్రకారం, కార్తీక మాసంలోని అమావాస్య తేదీ 24 అక్టోబర్ 2022న సాయంత్రం 05:27 గంటలకు ప్రారంభమై... 25 అక్టోబర్ 2022 సాయంత్రం 04:18 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం, కార్తీక అమావాస్య 25 అక్టోబర్ 2022న జరుపుకుంటారు.
కార్తీక అమావాస్య ప్రాముఖ్యత
>> పూర్వీకులకు తర్పణం మరియు శ్రాద్ధం చేయడానికి అమావాస్య తిథి శుభప్రదంగా శుభప్రదంగా భావిస్తారు.
>> స్కంద పురాణం ప్రకారం, కార్తీక మాసంలోని అమావాస్య రోజున పుణ్యస్నానం చేయడం మరియు దానం చేయడం ద్వారా వ్యక్తి యొక్క అన్ని పాపాలు నశిస్తాయి. అమావాస్య రాత్రి నూనె దీపం వెలిగిస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుంది.
>> ఈ రోజున విష్ణుమూర్తికి తులసిని నైవేద్యంగా సమర్పించి.. భగవద్గీతను పఠించాలి. కార్తీక అమావాస్య నాడు తులసిని పూజించడం ద్వారా విష్ణువు చాలా సంతోషిస్తాడు. ఇది ముక్తికి దారి తీస్తుంది.
>> కార్తీక అమావాస్య రోజున దీపాలు, ఆహారం మరియు వస్త్రాలు దానం చేయడం వల్ల వ్యాధులు మరియు దోషాల నుండి విముక్తి లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది. కార్తీక అమావాస్య రోజున చీమలకు తీపి పిండి తినిపిస్తే సర్వపాపాలు తొలగిపోయి కోరిన కోరికలు నెరవేరుతాయి.
Also Read: Shukra Pradosh Vrat 2022: శుక్ర ప్రదోష వ్రతం ఇలా చేస్తే.. ఇక మీకు దేనికీ లోటు ఉండదు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook