Kedar Yogam 2023: హిందూమతం ప్రకారం కొన్ని యోగాలకు అత్యంత ప్రాధాన్యత, మహత్యమున్నాయి. అందులో ఒకటి కేదార్ యోగం. ఈ యోగం చాలా అరుదైనది, విశేషమైంది. కుండలిలో కేదారయోగం ఏ రాశులకు శుభ పరిణామమో తెలుసుకుందాం..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఒకే రాశిలో రెండు లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు కలుసుకున్నప్పుడు యుతి లేదా యోగం ఏర్పడుతుంది. వీటి ప్రభావం అన్ని రాశుల జీవితాలపై విశేష ప్రభావం చూపించనుంది. ఈ సందర్భంగా కుండలిలో శుభ, అశుభ యోగాలు ఏర్పడటం వల్ల అందరిపై ప్రభావం పడుతుంది. ఏప్రిల్ 23వ తేదీన ఏర్పడనున్న కేదార్ యోగం అలాంటిదే. ఏకంగా 500 ఏళ్ల తరువాత ఈ యోగం ఏర్పడనుంది. అంతేకాకుండా ఈ రాశి జాతకుల జీవితాలపై పాజిటివ్ ప్రభావం చూపించనుంది. జ్యోతిష్యం ప్రకారం కేదార యోగం అరుదైనది, శుభమైనది. ఎవరి జాతకంలోనైనా కుండలి నాలుగవ పాదంలో 7 గ్రహాలుంటే..ఈ యోగం ఏర్పడుతుంది. ఏప్రిల్ 23న ఏర్పడనున్న కేదార యోగంతో ఏ రాశి వారికి ఎలాంటి ఫలాలు కలగనున్నాయో తెలుసుకుందాం..


సింహ రాశి


హిందూ జ్యోతిష్యుల ప్రకారం ఏప్రిల్ 23వ తేదీ తరువాత జీవితంలో ఆనందం పెల్లుబుకుతుంది. ఉద్యోగులకు కొత్త ఉద్యోగాలు లేదా పదోన్నతి కలుగుతుంది. కోరుకున్నచోటికి బదిలీ కావచ్చు. వ్యాపారులకు , విద్యార్ధులకు అనువైన సమయం. ఆర్ధిక ఇబ్బందులు అస్సలుండవు. ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటుంది


మేష రాశి


జ్యోతిష్యం ప్రకారం మేష రాశి జాతకులకు అంతులేని ధనలాభం కలగనుంది. అంటే పెద్దఎత్తున డబ్బులు వచ్చి పడనున్నాయి. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠలు పెరుగుతాయి. నిర్దేశిత లక్ష్యాల్ని సులభంగా ఛేదించగలుగుతారు. కెరీర్ విషయంలో సీరియస్‌గా ఉంటారు. ఆరోగ్యం బాగుంటుంది. ధనలాభం కలగడంతో ఆర్ధిక ఇబ్బందులు దూరమౌతాయి.


ధనస్సు రాశి


కేదార యోగం ధనస్సు రాశి జాతకులకు చాలా అనుకూలంగా ఉండనుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మనస్సు లగ్నమై ఉంటుంది. కెరీర్‌కు సంబంధించిన గుడ్‌న్యూస్ వినవచ్చు. వ్యాపారంలో మంచి లాభాలుంటాయి. కుటుంబసభ్యులతో మంచి సమయం గడుపుతారు. ఆర్ధిక పరిస్థితి పూర్తిగా మెరుగుపడుతుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం కూడా బాగుంటుంది.


Also read: Akshaya Tritiya 2023: అక్షయ తృతీయ మీ జీవితాన్ని ఎలా మార్చేయనుందో తెలుసా, డబ్బే డబ్బు



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook