Kedarnath Opening Date 2024: ఉత్తరాఖండ్‌లో ఉన్న కేదార్‌నాథ్‌ను జీవితంలో ఒక్కసారైనా దర్శించుకోవాలని హిందూవులు కోరుకుంటారు. ఈ ఏడాది కేదార్‌నాథ్‌ దర్శనం ఎప్పటి నుంచి చేసుకోవచ్చో తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కేదార్‌నాథ్‌ ఆలయం ప్రతి ఆరు నెలలకు ఒకసారి తెరుచుకుంటాయి. ఈ సమయంలో లక్షలాదిమంది బాబా కేదార్‌నాథ్‌ దర్శనం చేసుకుంటారు. దేశం నలుమూలల నుంచి భక్తులు వస్తారు. ఈ ఏడాది 2024 మే 10న కేదార్‌నాథ్ తలుపులు తెరచుకోనున్నాయి. ఇది ఉత్తరాఖండ్‌లో ఉంది. కేదార్‌నాథ్‌కు వెళ్లాలనుకునేవారు అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలి. అది ఎలాగో తెలుసుకుందాం.


ఈ యాత్రకు గౌరీకుంఢ్‌ నుంచి కేదార్‌నాథ్‌ యాత్రకు కాలినడకన వెళ్తారు. అయితే, మీరు త్వరగా కేదార్‌నాథ్‌ యాత్ర దర్శనం చేసుకోవాలంటే మీరు హెలిక్యాప్టర్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కాలినడకన వెళ్తే దాదాపు 16 కిలో మీటర్ల వరకు ప్రయాణించాల్సి ఉంటుంది. ఇక్కడి వాతావరణ పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతు ఉంటాయి. అంతేకాదు కాలినడక, హెలిక్యాప్టర్ ద్వారా ప్రయాణం చేయలేనివారు పల్లకి కూడా అందుబాటులో ఉంటుంది.. 


ఇదీ చదవండి: శనిప్రదోష వ్రతం ఎప్పుడు? ఈరోజు ప్రత్యేకతేంటో తెలుసా?


కేదార్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. అయితే, ఈ యాత్రకు వెళ్లేవారు బుక్‌ చేసుకున్ననాటి వాతావరణ పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ముఖ్యంగా శారీరకంగా కూడా దృఢంగా కూడా ఉండాలి. కేదర్‌నాథ్‌ యాత్రకు వెళ్లేవారు తగిన లగేజీని కూడా తీసుకెళ్లాలి. ముఖ్యంగా అక్కడి వాతావరణ పరిస్థితులు మారుతూ ఉంటాయి. కాబట్టి స్వెట్‌ దుస్తులు పెట్టుకోవాలి. ముఖ్యమైన ధృవపత్రాలు కూడా పెట్టుకోవాలి. అంటే ఆధార్ కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్ ఏదో ఒక ధృవీకరణ పత్రాలు మీతోపాటు మీతో ప్రయాణించే కుటుంబ సభ్యుల పత్రాలు కూడా అందుబాటులో పెట్టుకోవాలి.


ఇదీ చదవండి: సోమవతి అమావాస్య రోజు ఈ రెమిడీ చేస్తే శత్రువులు సైతం మోకరిల్లాల్సిందే..


ఈ యాత్ర మే 10 అక్షత తృతీయ రోజు ఉదయం 6:30 ఓపెన్ అవుతుంది. ఈ ఏడాది కేదార్‌నాథ్ యాత్ర తలుపులు 2024 నవంబర్ 20 న మూసివేస్తారు. అంటే దాదాపు ఆరునెలలు గుడి తలుపులు తెరుచుకుని ఉంటాయి. ఆ తర్వాత కూడా కొన్ని పూజ కార్యక్రమాలు పండితులు ఇక్కడ నిర్వహించి మరో ఆరునెలలపాటు గుడి తలుపులు మూసేస్తారు. ఈ కేదార్‌నాథ్ ఆలయంలో బాబా కేదార్‌నాథ్ పంచముఖి విగ్రహాన్ని పూజిస్తారు. (Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి