Mirror Vastu for Home:  వాస్తు ప్రకారం మనం ఇంటి నిర్మాణాలు చేపడతాం. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ దిశలను ఆధారంగా హాల్, కిచెన్, బాత్రూం వంటివి నిర్మించుకుంటాం. ఇలా వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణం చేపడితేనే ఆ ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది. దీనికి విరుద్ధంగా నిర్మాణం చేపడితే నెగిటివిటీ పెరుగుతుంది. అయితే, వాస్తు ప్రకారం ఇంటి నిర్మాణంతోపాటు ఇంట్లోని వస్తువులు కూడా వాస్తు ప్రకారం ఏర్పాటు చేసుకోవాలి. ఈరోజు వాస్తు ప్రకారం అద్దం ఏ దిశలో పెట్టుకోవాలో తెలుసుకుందాం.నిజానికి అద్దం బెడ్రూంలో పెట్టకూడదు అంటారు. అద్దంలో మంచం కనిపించకూడదు. లేకపోతే భార్యాభర్తల మధ్య విభేదాలు పెరుగుతాయి. ఒకవేళ అద్దం బెడ్రూంలో పెట్టుకోవాల్సివస్తే పడుకునే ముందు అద్దం కనిపించకుండా దానిపై ఏదైనా గుడ్డ కప్పి పెట్టాలి.వాస్తు ప్రకారం అద్దం తూర్పు దిశలో పెట్టుకుంటే ఇంట్లో ఉండే వారి గౌరవమర్యాదలు పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు లభిస్తుంది. వాస్తు ప్రకారం అద్దం ఉత్తర దిశలో ఏర్పాటు చేసుకుంటే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది. ఉత్తర దిశ కుబేరుడికి సంబంధించింది ఈ దిశలో అద్దం పెట్టుకుంటే డబ్బు రాక పెరుగుతుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి:  కారులో ఈ వస్తువులు ఉంటే యాక్సిడెంట్స్ అస్సలు జరుగవట..


వాస్తు ప్రకారం అద్దం ఏర్పాటు చేసుకోవడమే కాదు దాన్ని దూమ్మూధూళి పట్టకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. నిత్యం అద్దాన్ని తుడుస్తూ ఉండాలి. లేకపోతే నెగిటివిటీ ఆ ఇంట్లో పెరిగిపోతుంది. అంతేకాదు ఉదయం నిద్రలేవగానే అద్దంలో ముఖం చూసుకోకూడదు అంటారు. ముఖం కడిగిన తర్వాతే అద్దంలో ముఖం చూసుకోవాలి. అందుకే అద్దం బెడ్‌రూంలో పెట్టకూడదు. అంతేకాదు పగిలిన అద్దాలు కూడా ఇంట్లో ఉంచుకోకూడదు. పగిలిన అద్దంలో మన ముఖం చూసుకోకూడదు. ఇంట్లో నెగిటివిటీ పెరుగుతుంది. ఆర్థిక సంక్షోభం ఏర్పడుతుంది.


అంతేకాదు అద్దాన్ని కిచెన్లో పెట్టకూడదు. డబ్బు దాచిపెట్టే ప్రాంతంలో అద్దాన్ని పెట్టుకోవాలి. దీంతో డబ్బు రాక పెరుగుతుంది. కానీ, అద్దం ఉన్న అల్మారాను పెట్టుకోకూడదు. ఇలా పెట్టిన అద్దాన్ని చూడకూడదు. ఇంట్లో చతురస్రాకారం దీర్ఘచతురస్రాకారంలో ఉండే అద్దాన్ని పెట్టుకోవాలి. రౌండ్ షేపులో ఉండే అద్దాన్ని ఇంట్లో పెట్టకూడదు.  వాస్తు ప్రకారం పగిలిన అద్దాలను కూడా ఇంట్లో పెట్టుకోకూడదు. ఇంట్లోకి సూర్యరశ్మి వచ్చే ప్రాంతంలో అద్దాన్ని పెట్టుకుంటే ఇంట్లో పాజిటివిటీ పెడగడంతోపాటు ఆ ఇంట్లో డబ్బు, సంపాదన డబుల్ అవుతుంది.


ఇదీ చదవండి:  అమావాస్య, ఆపై ఆదివారం.. ఈ ఒక్క పరిహరం చేస్తే కటిక దరిద్రులు కూడా జాక్ పాట్ కొట్టేస్తారు..


అంతేకాదు వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాన్ని పెట్టుకునే ముందు నేల మీద నుంచి ఐదు అడుగుల ఎత్తులో ఏర్పాటు చేసుకోవాలి. అద్దం డ్రెస్సింగ్ రూం, బాత్రూం వంటి ప్రదేశాల్లో అద్దాన్ని ఏర్పాటు చేసుకోవాలి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 
 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి