Aquarium Vastu Tips:  ఇంట్లో అక్వేరియం  వాస్తు శాస్త్రం ప్రకారం మాత్రమే కాదు ఇంటి అలంకరణకు కూడా  ఏర్పాటు చేసుకుంటారు. ఫిష్ ట్యాంక్ ఇంట్లో పెట్టుకోవడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. దీన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. లేకపోతే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతుంది.ఇంట్లో చేపలను పెంచుకోవడం, చేపలకు ఫుడ్ పెట్టడం వంటివి చేస్తే మన ఇల్లు సుఖఃశాంతులతో వెల్లువిరుస్తుంది. ఇంట్లో ఉండే సభ్యులవారి ఆరోగ్యం కూడా బాగుంటుంది.  వాస్తు ప్రకారం ఇంట్లో ఫిష్‌ ట్యాంక్ ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో ఫిష్‌ ట్యాంక్ పెట్టుకుంటే మంచిది. కొన్నిసార్లు ఫిష్‌ ట్యాంకుల్లోని చేపలు చనిపోతాయి. ఇది ఆ ఇంటి పై ఉన్న దృష్టిదోషానికి సంకేతంగా పరిగణిస్తారు. అప్పుడు వెంటనే కొత్త చేపలను తెచ్చి వేయండి. అక్వేరియంలో ఉంచే చేపల సంఖ్య కూడా నియమాలు ఉన్నాయి. వాటికి అనుకూలంగా పెట్టుకోవాలి.అయితే, వాస్తు ప్రకారం అక్వేరియం అంటే నీళ్లు కాబట్టి దీన్ని సరైన దిశలో ఏర్పాటు చేసుకోవాలి. వీటిని దక్షిణ దిశలో పెట్టకూడదు. ముఖ్యంగా అక్వేరియంలో ఎరుపు, నలుపురంగు చేపలను పెడతారు.ముఖ్యంగా ఇంటి ప్రధాన ద్వారం ఎడమవైపు అక్వేరియం ఉంచితే దాంపత్య జీవితంలో ప్రేమ పెరుగుతుందని జోతిషులు చెబుతున్నారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇదీ చదవండి: తులసిమొక్కకు ఈ నెలలో 2 రోజులు నీరుపోస్తే అపచారం.. ఎప్పుడో తెలుసా?


వాస్తు ప్రకారం అక్వేరియం వంటగది లేదా బెడ్ రూంలో అస్సలు పెట్టకూడదు. దీంతో ధననష్టం వాటిల్లుతుంది. ఇలా చేయడం వల్ల వైవాహిక జీవితంలో గొడవలకు కూడా దారితీస్తుందట.ఇంట్లో అక్వేరియం ఉంటే దాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. దీంతో మీ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. చేపలకు ఫుడ్ పెడితే కూడా వాస్తు శాస్త్రం ప్రకారం డబ్బు సంక్షోభం నుంచి బయటపడతారు. అంతేకాదు అక్వేరియం పెంచుకునే ట్యాంక్ కూడా గుండ్రంగా ఉన్నది తీసుకోకుండా ఉండటమే మంచిది. దీర్ఘవృత్తాకారంలో ఉన్న ఫిష్‌ ట్యాంక్‌ను ఎంచుకోవాలి. దీంతో ఇంట్లో నెగిటివీటి తొలగిపోయి. పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. అంతేకాదు ఫిష్‌ ట్యాంక్‌లో సులభంగా చేపలు తిరగడానికి వీలుగా జాగా ఉండాలి. అప్పుడే అవి ఎక్కువ కాలం జీవిస్తాయి.


ఇదీ చదవండి: త్వరలో శని దేవుడి రాశి మార్పు.. ఈ రాశుల వారికీ లాటరీ తగిలినట్టే..


మీ ఇంట్లో ఉండే చేపల అక్వేరియంలో 9 చేపలను ఉంచాలి. అయితే, అంత మొత్తం పెంచుకోలేనివారు 5 చేపలు లేదా కేవలం 1 చేపను కూడా పెంచుకోవచ్చు. ఎందుకంటే బేసి సంఖ్యలు ఎక్కువ జీవిత శక్తిని ఆహ్వానిస్తాయని నమ్ముతారు.ఈ తొమ్మిది చేపలలో ఎనిమిది గోల్డ్ ఫిష్, ఒక బ్లాక్ ఫిష్ ఉండాలి. కానీ, తప్పుడు దిశలో ఏర్పాటు చేసుకోవడం వల్ల ఆర్థిక సంక్షోభం తప్పదు. వాస్తు ప్రకారం అక్వేరియం ఉత్తర దిశలోనే పెట్టుకోవాలి. దీంతో మీకు ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాదు ఉత్తర దిశ అంటే కుబేర దిశ. ఈ దశలో ఏర్పాటు చేసుకోండి.(Disclaimer: ఇక్కడ ఇవ్వబడిన సమాచారం సాధారణ నమ్మకాలు మరియు సమాచారంపై ఆధారపడి ఉంటుంది. ZEE NEWS దీన్ని ధృవీకరించలేదు.) 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook