Ketu Gochar 2023: కేతువు స్థానంలో పెను మార్పు... ఈ రాశులకు ఏడాదంతా డబ్బే డబ్బు..
Ketu Gochar 2023: త్వరలో కేతువు తన రాశిని మార్చబోతున్నాడు. కేతువు తులారాశి నుండి బయలుదేరి కన్యారాశిలోకి ప్రవేశించనున్నాడు. దీని సంచారం కొందరికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వనుంది.
Ketu Gochar 2023: న్యూ ఇయర్ లో కేతు గ్రహం తన స్థానాన్ని మార్చుకోనుంది. జ్యోతిష్యశాస్త్రంలో కేతు గ్రహాన్ని అశుభ గ్రహంగా భావిస్తారు. ఆధ్యాత్మికత, నిశ్శబ్దం, మోక్షం మెుదలైన వాటికి కేతువును కారకుడిగా భావిస్తారు. అక్టోబర్ 30, 2023 మధ్యాహ్నం 2.13 గంటలకు కేతువు తులారాశిని వదిలి కన్యారాశిలోకి ప్రవేశించనుంది. కేతు గ్రహం (Ketu Gochar 2023) యొక్క రాశిలో మార్పు ఏరాశివారిక శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం.
కేతు సంచారం ఈ రాశులకు అనుకూలం
వృషభం (Taurus): కేతువు యెుక్క గోచారం ఈ రాశివారికి మేలు చేస్తుంది. మీ యెుక్క సమస్యలన్నీ తీరిపోతాయి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. ఆర్థికంగా మీరు బలపడే అవకాశం ఉంది. ఫార్టనర్ షిప్ తో చేసే వ్యాపారంలో మీరు లాభాలను పొందుతారు. బిజినెస్ ఇన్వెస్ట్ చేయడం లాభదాయకంగా ఉంటుంది.
సింహ రాశి ఫలం (Leo): సింహ రాశి వారికి కేతు గ్రహ సంచారం ప్రయోజనకరంగా ఉంటుంది. మీ సామాజిక గౌరవం పెరుగుతుంది. ఈ సమయంలో మీరు వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం వల్ల రాబోయే కాలంలో మీరు మంచి రాబడిని సాధిస్తారు. ఆఫీసులో ఈ టైం మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు సహోద్యోగులు మరియు అధికారుల సపోర్టు లభిస్తుంది. మీ కష్టానికి తగిన ఫలితాలను లభిస్తాయి.
ధనుస్సు (Sagittarius): కేతువు యొక్క సంచారం ధనుస్సు రాశి వారికి కలిసి వస్తుంది. మీ కెరీర్ లో అపారమైన పురోగతిని సాధిస్తారు. మతపరమైన పనుల పట్ల మీరు ఆసక్తి చూపుతారు. మీరు కెరీర్ లో ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారు. ఆదాయంలో రెట్టింపు లాభం ఉంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది.
Also Read: Shani dev: మనపై శనిదేవుడు కోపంగా ఉన్నాడా లేదా దయతో ఉన్నాడా తెలుసుకోవడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe