Shani dev: మనపై శనిదేవుడు కోపంగా ఉన్నాడా లేదా దయతో ఉన్నాడా తెలుసుకోవడం ఎలా?

Shani dev Sanket: ఆస్ట్రాలజీ ప్రకారం, శనిదేవుడు అనుగ్రహం ఉంటే దరిద్రుడు కూడా ధనవంతుడు అవుతాడు. అలాంటి శనిదేవుడు మీపై కోపంగా ఉన్నాడో లేదా దయతో ఉన్నాడో తెలుసుకోవాలంటే జ్యోతిష్యశాస్త్రంలో కొన్ని చిట్కాలు చెప్పబడ్డాయి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 6, 2023, 10:54 AM IST
Shani dev: మనపై శనిదేవుడు కోపంగా ఉన్నాడా లేదా దయతో ఉన్నాడా తెలుసుకోవడం ఎలా?

Shani dev Sanket: మానవులు చేసే మంచి, చెడు పనుల ప్రకారం ఫలాలను ఇచ్చే దేవడు శని. అందుకే శనిదేవుడిని న్యాయదేవుడు, కర్మదాత అంటారు. అందుకే ప్రజలు శని యెుక్క చెడు దృష్టిని నివారించడానికి అనేక పరిహారాలు చేస్తారు. శనిదేవుడు సానుకూల దృష్టి పడితే బిచ్చగాడు కూడా బిలియనీర్ అవుతాడు.  అయితే మనపై శనిదేవుడి అనుగ్రహం ఉందో లేదా శనిదేవుడి కోపం ఉందో తెలియక చాలా మంది అయోమయానికి గురి అవుతూ ఉంటారు. మనకు నిత్య జీవితంలోజరిగే కొన్ని సంఘటనలు బట్టి దీనిని మనం అంచనా వేయవచ్చు.  

శని అనుగ్రహం ఉంటే..
ఒక వ్యక్తిపై శని దేవుడు అనుగ్రహం కురిపిస్తే... అలాంటి వారికి సమాజంలో చాలా గౌరవం లభిస్తుంది. పెద్ద ప్రమాదం జరిగినా కూడా వారు ఎలాగోలా బతికి బయటపడతారు. శనిదేవుడి దయ ఉంటే మీ ఆరోగ్యం బాగుంటుంది. మీకు ధనలాభం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో అద్భుతమైన పురోగతి ఉంటుంది. అదే విధంగా దేవాలయం దగ్గర మీ పాదరక్షలు మరియు చెప్పులు దొంగిలించబడటం కూడా శని దేవుడి యొక్క శుభ సంకేతంగా భావిస్తారు. 

శని మీపై కోపంగా ఉంటే...
శనిదేవుడు వక్ర దృష్టి మీపై పడిందంటే మీరు అనేక రకాల సమస్యలను ఎదుర్కోంటారు. మీ ఆరోగ్యం చెడిపోతుంది. భారీగా డబ్బు నష్టపోతారు. కష్టపడి పనిచేసినప్పటికీ మీ దగ్గర  డబ్బు ఉండదు. మీ కెరీర్ దెబ్బ తింటుంది. కుటుంబంలో ఎప్పుడూ గొడవలు ఉంటాయి. మీకు ఎక్కడా అప్పు పుట్టదు. పేదరికం తాండవిస్తోంది.

Also Read: Shani Asta 2023: జనవరిలో 'శని' స్థానంలో పెను మార్పులు... వీళ్లకు లాటరీ తగలడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U    

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

Trending News