Ketu Mahadasha Remedies: ఈ రాశుల వారికి 7 సంవత్సరాల పాటు మహర్దశ.. ప్రారంభం కానున్న కేతు మహాదశ
Ketu Mahadasha Remedies: వ్యక్తుల జీవితాల్లో నవగ్రహాలు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా కేతువు మహర్దశ వల్ల రాజయోగం ఏర్పడుతుంది. ఈ యోగం వల్ల వ్యక్తుల జీవితాల్లో అన్నీ మంచి జరుగుతాయి. మరి మీ జాతకం కూడా మహర్దశలో ఉందా..?
Ketu Mahadasha Remedies: వ్యక్తుల జీవితాల్లో నవగ్రహాల అంతర్దశ మహాదశ తీవ్ర ప్రభావం చూపే అవకాశాలున్నాయి. ఈ ప్రభావం నేరుగా రాసి చక్రాలపై పడి వ్యక్తి జీవితాల్లో మార్పులు అశుభ ఫలితాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా రాశుల్లో కేతు ఎంట్రీ అయితే వ్యక్తి జీవితంలో తీవ్ర దుష్ప్రభావాలు ఎదురవుతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. వాస్తవానికి జ్యోతిష్య శాస్త్రంలో కేతువును చెడు ఫలితంగా పేర్కొన్నారు. అయితే కేతువు వల్ల కొన్ని సందర్భాల్లో ముఖ్యంగా మహా దశలో మంచి ఫలితాలు ఇచ్చే అవకాశాలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.
ఒక్కసారి జీవితంలో కేతు మహాదశ ప్రారంభమైతే ఇక జీవితాంతం పండగేనని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు అంటున్నారు. ఈ మహా దశ వల్ల వ్యక్తుల జీవితాల్లో అన్ని శుభాలు జరగడమే కాకుండా మోక్షం కటాక్షం లభించి..ఆర్థికపరమైన సమస్యలు తీరుతాయి. ఒక వ్యక్తి జాతకంలో కేతువు తృతీయ పంచమి 12వ స్థానాల్లో ఉంటే వ్యక్తి జీవితంలో అన్నీ శుభపరిణామాలు ఏర్పడతాయని అంతేకాకుండా జాతకంలో రాజయోగం ఏర్పడుతుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈ రాజయోగ గడియలు వ్యక్తి ఆధ్యాత్మికం వైపు ఎక్కువగా చొరవ చూపుతాడు. అంతేకాకుండా సమాజంలో మంచి పేరు కూడా సంపాదించుకుంటాడు.
జాతకంలో కేతువు అశుభసంచారం చేస్తే.. వ్యక్తుల జీవితాల్లో తీవ్ర మార్పులు వచ్చి చాలా రకాల సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా చేసే పనుల్లో అడ్డంకులు ఏర్పడి ఆర్థిక నష్టం భారీ మొత్తంలో జరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాల్లో డీలింగ్స్ అన్ని చెడిపోయి తీవ్ర నష్టాల్లోకి సంస్థ వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కేతువు అశుభ ఫలితాలను ముందుగానే గమనించి దాని నుంచి ఉపశమనం పొందడం చాలా మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
కేతువు అశుభ ఫలితాల నుంచి ఇలా ఉపశమనం పొందండి:
>>ఎప్పుడు తీవ్ర నష్టాల పాలవుతుంటే తప్పకుండా నలుపు రంగు ఆవుని ఇతరులకు దానం చేయాల్సి ఉంటుంది.
>>కేతువు దుష్ప్రభావాలనుంచి విముక్తి పొందడానికి వికలాంగులకు ఆహారం డబ్బు ఇతర వస్తువులను దానం చేయాల్సి ఉంటుంది.
>>ముఖ్యంగా నూనెతో పోసిన రొట్టెలను కుక్కలకు ఆహారంగా వెయ్యడం వల్ల కూడా కేతువు అశుభ ఫలితాల నుంచి ఉపశమనం పొందవచ్చు.
>>ప్రతిరోజు కేతువుకు సంబంధించిన మంత్రాన్ని పారాయణం చేయాల్సి ఉంటుంది.
Also Read: Super Star Krishna Death : కృష్ణ మరణం.. పీఎం, సీఎంల సంతాపం.. అంత్యక్రియలు ఎప్పుడంటే?
Also Read: Pawan Kalyan Fans: పవన్ ను చూసి రెచ్చిపోయిన అభిమానులు.. ఇదేం బుద్ది?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook