Ketu Transit 2022: కేతువు సంచారం... ఈ 3 రాశులవారి దశ తిరగడం పక్కా..!
Astrology: కేతువు అనుగ్రహం వల్ల కొన్ని రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుంది. ఏయే రాశుల వారికి కేతువు సంచారం శుభప్రదంగా ఉంటుందో ఇక్కడ తెలుసుకుందాం.
Ketu Transit 2022 Effect: ప్రతి గ్రహం నిర్దిష్ట సమయం తర్వాత తన రాశిని మారుస్తుంది. ఈ గ్రహాల రాశి మార్పు కొందరికి ప్రయోజనకరంగా ఉంటే... మరికొందరికి అశుభంగా ఉంటుంది. ప్రస్తుతం ఛాయా గ్రహం కేతువు తులరాశిలో సంచరిస్తోంది. ఏప్రిల్ 12, 2022న తుల రాశిలోకి ప్రవేశించిన కేతువు (Ketu Transit in Libra 2022).. వచ్చే ఏడాది అక్టోబరు 30 వరకు అక్కడే ఉండనుంది. తులరాశిలో కేతువు సంచారం వల్ల మూడు రాశుల వారికి కలిసిరానుంది. ముఖ్యంగా మకరం, కర్కాటకం, కుంభ రాశివారి జాతకల్లో ధనరాజయోగం ఏర్పడుతుంది. ఫలితంగా వీరు అపారమైన ఆర్థిక ప్రయోజనాలను పొందనున్నారు.
అదృష్ట రాశులివే...
కర్కాటకం (Cancer): ఈ రాశివారికి కొత్త జాబ్ వస్తుంది. ఉద్యోగులకు ప్రమోషన్ పొందుతారు. పెళ్లి కుదిరే అవకాశాలున్నాయి. ఈ సమయంలో ఆస్తి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశముంది. ట్రాన్సలేషన్ చేసే వారికి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది.
మకరం (Capricorn): కేతు సంచారం వల్ల ఈరాశివారి అదృష్టం పెరుగుతుంది. అనేక మార్గాల ద్వారా డబ్బును సంపాదిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ రావచ్చు. ఎక్కడైనా చిక్కుకుపోయిన డబ్బు మీ వద్దకు చేరుతుంది.
కుంభం (Aquarius): ఈ రాశివారు లక్ తో ప్రతిపనిలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారానికి సంబంధించిన ప్రయాణాలు కలిసి వస్తాయి. ఆర్థికంగా మెరుగుపడతారు. పోటీపరీక్షలకు సిద్ధమవుతున్నవారు విజయం సాధిస్తారు. కోర్టు వ్యవహారాలు మీకు కలిసి వస్తాయి.
Also Read: Suryadev Remedies: సూర్యభగవానుడి కటాక్షం పొందాలంటే.. ఆదివారం ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook