Suryadev Remedies: సూర్యభగవానుడి కటాక్షం పొందాలంటే.. ఆదివారం ఇలా చేయండి!

Suryadev: మనకు కనిపించే దేవుడు సూర్యభగవానుడు. ఈ దేవుడు అనుగ్రహం పొందాలంటే ఆదివారం నాడు ఆర్ఘ్యాన్ని సమర్పిస్తే చాలు. ఇంకా కొన్ని పరిహారాలు చేయడం ద్వారా సూర్యుడిని ప్రసన్నం చేసుకోవచ్చు.  

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Aug 28, 2022, 09:10 AM IST
Suryadev Remedies: సూర్యభగవానుడి కటాక్షం పొందాలంటే.. ఆదివారం ఇలా చేయండి!

Suryadev Remedies: ఆదివారం సూర్యభగవానుడిని పూజిస్తారు. సూర్య భగవానుని అనుగ్రహం పొందాలంటే.. రాగి కలశంలో అర్ఘ్యాన్ని క్రమం తప్పకుండా సమర్పించడం చాలా మంచిది. ఇలా చేయడం వల్ల ఆ వ్యక్తి జాతకంలో సూర్యుడు (Suryadev) బలపడతాడు. తత్ఫలితంగా ఆ వ్యక్తికి కీర్తి, పురోగతి, గౌరవం, ప్రతిష్ట, ఆరోగ్యం లభిస్తాయి. ఆస్ట్రాలజీ ప్రకారం, సూర్యుడిని ప్రసన్నం చేసుకోవాలంటే.. ఆదివారం దానం చేయండి. 

ఆదివారం ఈ పరిహారాలు చేయండి..
>> మీ జాతకంలో సూర్యభగవానుడు బలోపేతం కావాలంటే ఆదివారం నాడు ఆవులకు రొట్టె తినిపించండి. అదే విధంగా చీమలకు చక్కెర, చేపలకు పిండి ఆహారంగా వేయండి. 
>> మీరు ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంటే.. ఒక రాగి ముక్కను రెండు భాగాలు చేయండి. మీ కోరికను మనసులో తలచుకుని ఒక భాగాన్ని నదిలో పడవేయండి. ఇంకో రాగి ముక్కను మీ వద్ద ఉంచుకోండి. ఈ పరిహారంతో మీరు ప్రయోజనం పొందుతారు. 
>> సూర్యభగవానుడి ఆశీస్సులు పొందాలంటే.. క్రమం తప్పకుండా సూర్యుడి మంత్రాన్ని పఠించండి. 'ఓం హరం హరిం హ్రౌం సహ సూర్యాయ నమః' అనే మంత్రం జపిస్తే సూర్య భగవానుడు కృప ఎల్లప్పుడూ మీపైనే ఉంటుంది.  
>> ఆగిపోయిన మీ పని పూర్తవవ్వాలంటే ఆదివారం ఎర్రచందనం తిలకం ధరించి ఇంటి నుండి బయటకు వెళ్లిరండి. ఆ తర్వాత ఆ వర్క్ దానంతట అదే సక్రమంగా జరుగుతుంది. 

Also Read: Grah Gochar 2022: సెప్టెంబరులో ఈ 3 గ్రహాల సంచారం... ఈ రాశులకు భారీ లాభం! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News