Koti Deepotsavam 2024: ప్రతి యేడాది భక్తి టీవీ,  ఎన్టీవీ నిర్వహిస్తూ వస్తున్న కోటీ దీపోత్సవం కార్యక్రమంలో ఎంతో మంది భక్తుల మన్నన్నలు చూరకొంది. కార్తీక మాసంలో కోటీ దీపోత్సవంలో భాగంగా ముక్కొీ హిందూ దేవీ దేవతల పూజ నిర్వహిస్తూ ఉన్నారు. అంతేకాదు కార్తీక మాసం అంటే దీపానికి ప్రతీక. ఈ నేపథ్యంలో  విశిష్టంగా దీపాలను వెలిగించడం ఆనవాయితీ వస్తోంది.  ఈ నేపథ్యంలోనే భక్తి టీవీ ఎన్టీవీ సంయుక్తంగా కార్తీక కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని 2012లో శృంగేరి పీఠాధిపతి జగద్గురు భారతీ తీర్థ మహాస్వాముల వారి అమృత హస్తాల మీదుగా ప్రారంభించారు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అప్పటి నుంచి ఎలాంటి అవాంతరాలు లేకుండా.. దిగ్విజయంగా ఈ వేడుక జారుతూనే ఉంది. తాజాగా 2024 యేడాదికి సంబంధించిన  ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించడానికి సర్వం సిద్ధమైంది. ఎవ్రీ ఇయర్  జరిగే లాగానే ఈ ఏడాది కూడా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించబోతున్నారు. ఈ కోటి దీపోత్సవం కార్యక్రమంలో అతి ముఖ్యమైన ఘట్టం.. ఒక్కసారిగా ప్రజ్వలించే దీపాలు, లక్షలాది మంది భక్తులు ఒకేసారి ఒకే ప్రాంగణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకునే ఈ దృశ్యం మాటలకు అందనది.


‘‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే’’ అంటారు. అంతే ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుందనేది పురాణాల కథనం. దీపం వెలుగుకు, జ్ఞానానికి సంకేతం, ఆధ్యాత్మికంగా దీపానికి అత్యంత ప్రాముఖ్యత ఉందని చెప్పాలి.


మన సంస్కృతికి సంప్రదాయాలకు దీపారాధన ముఖ్యమైన ఘట్టం అనే చెప్పాలి. అటువంటి సంప్రదాయాన్ని భవిష్యత్‌ తరాలకు సమున్నతంగా అందించడమే ఈ కార్యక్రమ ఉద్దేశ్యం.  2012 నుంచి భక్తి టీవీ ఈ కోటి దీపోత్సవాన్ని ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా నిర్వహిస్తూ వస్తోంది. గతేడాది జరిగిన కోటీ దీపోత్సవ కార్యక్రమానికి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా హాజరు కావడం విశేషం.


దానిలో భాగంగా ఈ ఏడాది ఈ కోటి దీపోత్సవం కార్యక్రమం నవంబర్‌ 9 న ప్రారంభమవుతోంది. అంతేకాదు ఈ నెల నవంబర్ 25 వరకు హైదరాబాద్, ఎన్టీఆర్‌ స్టేడియంలో జరుగనుంది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొనడానికి నగరం నలువైపులతో పాటు తెలంగాణ, ఏపీ నుంచి పలువురు భక్తులు తరలి వస్తారు. అలాగే దేశ నలుమూలల నుండి సాధు పుంగవులు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ప్రవచనకర్తలు, హైందవ సమాజ సేవకులు వేలాది సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉంటారు.ఈ సారి కూడా అదే విధంగా కోటీ దిపోత్సవం విజయవంతం అవుతుందనే భక్తులు విశ్వసిస్తున్నారు.


ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..


ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.