Lakshmi Devi Signs: మీ ఇంట్లో ఆ సంకేతాలు కన్పించాయా..అయితే మీ ఇంట్లో డబ్బులు వచ్చి పడతాయి
Lakshmi Devi Signs: లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖసంతోషాలే. లక్ష్మీదేవి ఏదైనా ఇంటికి వచ్చేముందు సంకేతాలు చాలా వస్తాయట. ఆ సంకేతాల్ని గుర్తించగలిగితే చాలంట. ఆ సంకేతాలేంటో తెలుసుకుందాం..
Lakshmi Devi Signs: లక్ష్మీదేవి ఏ ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో సుఖసంతోషాలే. లక్ష్మీదేవి ఏదైనా ఇంటికి వచ్చేముందు సంకేతాలు చాలా వస్తాయట. ఆ సంకేతాల్ని గుర్తించగలిగితే చాలంట. ఆ సంకేతాలేంటో తెలుసుకుందాం..
లక్ష్మీదేవిని ధనానికి దేవతగా పిలుస్తారు. విష్ణు భగవానుడి భార్య లక్ష్మీదేవి. అందుకే విష్ణు భగవానుడిని కొలిచిన ప్రతిసారీ లక్ష్మీదేవికి కూడా పూజలు చేస్తుంటారు. ఇలా చేయడం ద్వారా ఇంట్లో సుఖ సంతోషాలు, కుటుంబంలో ఐక్యత వర్ధిల్లుతుందని నమ్మకం. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం ఏదైనా ఇంట్లో సంపద వచ్చేముందు కొన్ని రకాల సంకేతాలు కూడా కన్పిస్తాయి. మీరు కూడా ఆ సంకేతాల్ని గుర్తించవచ్చు.
మీ కుడిచేతిలో హఠాత్తుగా దురద ప్రారంభమైతే లక్ష్మీ దేవీ మీపై కరుణించిందని..త్వరలో మీ ఇంట్లో సంపద వస్తుందని అర్ధమట. ఆర్ధికంగా ప్రయోజనం చేకూరడమే కాకుండా శుభవార్త కూడా వింటారు. మీ ఇంటి ప్రదాన గుమ్మం లేదా ఇంటి ఆవరణలో నల్లని పక్షులు వచ్చి ఏదైనా తింటూ కన్పించినా అది శుభసంకేతమేనట. నల్ల పక్షులు రాక హఠాత్తుగా ఎక్కడి నుంచైనా సంపద వచ్చిపడే మార్గమట.పెండింగులో ఉన్న పనులు పూర్తవుతాయని అర్ధం.
మీరు ఉదయం వేళల్లో ఎక్కడికైనా బయటకు వెళ్తున్నప్పుడు దారిలో ఎవరైనా వ్యక్తి ఊడుస్తూ కన్పిస్తే ..మీ సమస్యలన్నీ త్వరగానే తొలగిపోతాయని అర్ధమట. త్వరలో మీ ఇంటికి లక్ష్మీదేవి చేరుతుందని కూడా సంకేతమట. ఆంతేకాదు..పక్షులు మీ ఇంట్లో గూడు కట్టుకుందంటే చాలా మంచి శకునమని అంటారు. ఇంటికి లక్ష్మీదేవి రావడానికి ప్రధాన సంకేతమదేనట. పక్షుల గూడు ద్వారా లక్ష్మీదేవి తన రాకను సూచిస్తుందట.
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మీ ఇంట్లో ఏదైనా గోడపై 3 బల్లులు ఒకేసారి కన్పించినా అది శుభసంకేతమేనట. ఇలా కన్పిస్తే ఆ ఇంట్లో ఆర్ధిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయని అర్ధమట.
Also read: Friday Remedies: శుక్రవారం నాడు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే ఇలా చేయండి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook