Sri Rama Navami 2024: దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలంలో సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ వేడుకకు ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అన్ని శాఖలు సమన్వయం చేసుకుని అధికారులు పని చేస్తున్నారు. అయితే భద్రాచలంలో కల్యాణ వేడుకను ప్రత్యక్షంగా వీక్షించాలని భక్తులందరూ భావిస్తుంటారు. కానీ కుదరని పరిస్థితి. అలాంటి వారు టీవీలు, సామాజిక మాధ్యమాల ద్వారా కోట్లాది మంది భక్తులు వీక్షిస్తుంటారు. కానీ ఈసారి అది కుదరదు. కల్యాణ వేడుక ప్రత్యక్షప్రసారం చేయడానికి ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించింది.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Amarnath Yatra 2024: అమర్‌నాథ్ యాత్రికులకు శుభవార్త.. రిజిస్ట్రేషన్ ప్రారంభం..


 


దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంది. తెలంగాణలో కూడా ఎన్నికల నియమావళి కొనసాగుతుండడంతో శ్రీరామనవమి ఉత్సవాలకు కూడా కొంత ఆటంకం ఏర్పడింది. ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి పట్టువస్త్రాలు సమర్పించడం కూడా లేదని తెలుస్తోంది. దీనిపై ఇంకా స్పష్టత రాలేదు. ఇప్పుడు కల్యాణ వేడుకను ప్రత్యక్ష ప్రసారంపై కూడా ఆంక్షలు విధించారు. 'భద్రాచలం సీతారాముల కల్యాణం ప్రత్యక్ష ప్రసారానికి ఎన్నికల సంఘం అనుమతించ లేదు' అని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.

Also Read: Bellam Paanakam, Vadapappu: బెల్లం పానకం, వడపప్పులు చేసేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయోద్దు..


 


వేలాది మంది భక్తులు భద్రాచలంలో కల్యాణం ప్రత్యక్షంగా వీస్తుంటే.. కోట్లాది మంది భక్తులు ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తుంటారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఎన్నికల సంఘాన్ని సంప్రదించారు. భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకుని ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. 40 ఏళ్లుగా కల్యాణం ప్రత్యక్షప్రసారం జరుగుతోందని గుర్తు చేశారు. ఎన్నికలు ఉన్నా కూడా భక్తుల మనోభావాల దృష్ట్యా ప్రత్యక్ష ప్రసారానికి అనుమతించాలని కోరారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టత, సంప్రదాయాలు వివరిస్తూ కొండా సురేఖ లేఖ రాశారు. అయితే ఎన్నికల సంఘం మంత్రి విజ్ఞప్తిని తిరస్కరించినట్లు సమాచారం. ప్రత్యక్ష ప్రసారానికి ఈసీ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఈసీ తుది నిర్ణయంపై ఇంకా స్పష్టత రాలేదు.


దేశంలోనే అత్యంత వైభవంగా సీతారాముల కల్యాణం అయోధ్యలో జరుగుతుంటుంది. నవమి రోజు కల్యాణం, తర్వాతి రోజు పట్టాభిషేకం నేత్రపర్వంగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తుంటారు. ఈ శ్రీరామనవమికి కూడా అదే స్థాయిలో భక్తులు వచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే ఎన్నికల కోడ్‌ అమల్లో ఉండడంతో రామనవమి ఉత్సవాలపై కొన్ని ఆంక్షలు ఉన్నాయి. పట్టువస్త్రాల సమర్పణ, వీఐపీల రాకపోకలు, ఇప్పుడు ప్రత్యక్షప్రసారంపై ఆంక్షలు వచ్చాయి. అయితే భక్తుల డిమాండ్‌ దృష్ట్యా ఈసీ పునరాలోచించే అవకాశం ఉంది. రెండు రోజుల్లో ఉత్సవాలపై ఎన్నికల సంఘం తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter