Avoid These Mistakes While Preparing Ballam Panakam And Vadapappu: మన దేశంలో భిన్నత్వంలో ఏకత్వంను పాటిస్తుంటారు. అన్ని వర్గాల వారు ఒకరి పండుగలు, ఆచారాలు పద్ధతులను మరోకరు గౌవవించుకుంటారు. ఒక వర్గానికి చెందిన పండుగలకు, మరోకరిని ఆహ్వానిస్తారు. ప్రస్తుతం పండుగల సీజన్ నడుస్తోంది. ఇటీవల ఉగాదిని దేశంలో ఘనంగా జరుపుకున్నారు. ఇక.. మరో రెండు రోజుల్లో శ్రీరామనవమి కూడా రానుంది. దీంతో భక్తులంతా ఇప్పటి నుంచి వేడుకలను ప్రారంభించుకున్నారు. అంతేకాకుండా.. రామయ్యకోసం ప్రత్యేకంగా నైవేద్యాలు, పూలమాలతో డెకోరేషన్ చేసుకొవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
Read More: Happy Sri Rama Navami 2024: శ్రీ రాముడి స్పెషల్ కోట్స్, శక్తివంతమైన స్తోత్రాలు మీకోసం..
ముఖ్యంగా శ్రీ రామనవమి రోజున.. రామయ్యకు వడపప్పు, బెల్లం పానకంను హిందువులంతా తప్పకుండా తమ ఇళ్లలో తయారు చేస్తారు. వడపప్పు, బెల్లం పానకం తయారు చేయడం ఎంతో ఈజీగా ఉంటుంది. దీని వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. సమ్మర్ లో ముఖ్యంగా.. బెల్లం పానకం తింటే చలువ చేస్తుందని కూడా చెబుతుంటారు. శరీరంలో ముఖ్యంగా వేడి సమస్యలున్న వారు బెల్లం పానకం తింటే వెంటనే ఉపశమనం ఉంటుందని సూచిస్తుంటారు. కానీ అధిక మొత్తంలో బెల్లం పానకం తాగడం వల్ల కొందరి స్టమక్ పెయిన్ వస్తుందని కూడా చెబుతుంటారు. కొన్నిసార్లు పొత్తి కడుపులో నొప్పి మోషన్స్ కూడా కలిగే అవకాశం ఉంటుందని చెబుతారు.
ముఖ్యంగా
బెల్లం పానకం చేసేటప్పుడు జాగ్రత్తలు..
బెల్లంపానకం చేసేటప్పుడు బెల్లంను కొందరు సన్నగా తురుముకోరు. ఉండలుగానే వేస్తారు. ఇలా చేయడం వల్ల బెల్లం నీటిలో సరిగ్గా కరగదు. అదే విధంగా దీనిలో యాలకులు, సోంఠి, మిరియాలను తప్పనిసరిగా పౌడర్ లాగా చేసుకొవాలి. యాలకుల పొట్టు తీసేయాలి. యాలకులు, సోంఠి,మిరియాలను బెల్లం నీళ్లలో అలానే వేస్తే, గొంతులో ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది.
వడపప్పు తయారీలో ఈ తప్పులు చేయోద్దు..
వడపప్పును తొలుత ఒక గిన్నెలో వేసుకొవాలి. ఆ తర్వాత.. నీళ్లతో కడిగేయాలి. నీళ్లను ఎక్కువగా వేయకూడదు. కొందరు పెసరపప్పులో ఎక్కువగా నీళ్లు వేసి గంటల తరబడి వదిలేస్తుంటారు. ఇలాంటి పనులు చేయడం వల్ల ఒక రకమైన దుర్వాసన వస్తుంది. అందుకే కేవలం పెసరపప్పులో ఒక పదినిముషాలు మాత్రమే నీళ్లను ఉంచి ఆ తర్వాత నీళ్లను కిందకు పొయేలా వడపోయాలి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter