Sade Sati Dhaiyaa Remedies: ఆస్ట్రాలజీ ప్రకారం, శని ఒక క్రూరమైన గ్రహంగా పరిగణించబడుతుంది. శని కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. శని ఎల్లప్పుడూ అశుభ ఫలితాలనే ఇవ్వడు. వ్యక్తి యొక్క చర్యలు మంచిగా ఉంటే, శని కూడా శుభ ఫలితాలను ఇస్తాడు. సడే సతి, ధైయాతో బాధపడుతున్న వారు కూడా శని అనుగ్రహాన్ని పొందవచ్చు. దీనికి కొన్ని చర్యలు తీసుకోవాలి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పనులు అస్సలు చేయవద్దు..
శని ఆగ్రహానికి గురికాకుండా ఉండాలంటే శనికి ఇష్టం లేని ఇలాంటి పనులు అస్సలు చేయకూడదు. లేకపోతే, శని యొక్క వక్ర దృష్టి...మన జీవితాన్ని అంధకారంలోకి నెడుతుంది. పేదరికం, వ్యాధులు వెంటాడుతాయి. అశుభకరమైన శని వ్యక్తిని తప్పుడు పనులు చేసేలా బలవంతం చేస్తుంది. దీంతో ఆ వ్యక్తి జీవితం నాశనమవుతుంది. కాబట్టి పేదలను, ఉద్యోగులను దోపిడీ చేయవద్దు. నిస్సహాయులను అవమానించవద్దు. అమాయక జంతువులను వేధించవద్దు. ఎవరినీ మోసం చేయవద్దు. 


శని అనుగ్రహం పొందాలంటే..
>> శని అనుగ్రహం పొందడానికి పేదలు, నిస్సహాయులు, మహిళలకు సహాయం చేయడం ఉత్తమ మార్గం. వీరికి సహాయం చేసే వారిపై శని దేవుడి దయ ఎల్లప్పుడూ ఉంటుంది. ఇలాంటి పనులు చేయడం వల్ల శని దోషం కూడా తొలగిపోతుంది. 
>> జంతువులకు సేవ చేసి ఆహారం మరియు నీరు ఇచ్చేవారిని శని ఎల్లప్పుడూ అనుగ్రహిస్తాడు.
>> నిజాయితీగా కష్టపడి పనిచేసేవారిపై శని దయ ఎల్లప్పుడూ ఉంటుంది.
>> ఎప్పుడూ శుభ్రంగా ఉండే వ్యక్తులను, గోళ్లను శుభ్రంగా ఉంచుకునే వ్యక్తులను శని ఎప్పుడూ ఇబ్బంది పెట్టడు.  
>> మాంసాహారం, మద్యం సేవించే వారు, జూదం, బెట్టింగ్‌లు ఆడేవారు శని దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి ఎల్లప్పుడూ ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. 


Also Read: Shani Dev: శని దేవుడి దయ ఈ 3 రాశులవారిపై ఎల్లప్పుడూ ఉంటుంది, అందులో మీరు ఉన్నారేమో చూసుకోండి! 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G 


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook