Shani Dev Favourite Rashi: శనిదేవుడి దయ ఉంటే  బిక్షగాడే అయినా సరే ధనవంతుడు అవుతాడు. శని అనుగ్రహం వారి దశ తిరగడానికి ఎంతో సమయం పట్టదు. జ్యోతిష్య శాస్త్రంలో శని దేవుడికి (Lord Shani) ఇష్టమైన కొన్ని రాశుల గురించి చెప్పబడింది. శని వారి పట్ల ఎల్లప్పుడూ దయతో ఉంటాడు. ఆ అదృష్ట రాశులు ఏమిటో ఇప్పుడు  తెలుసుకుందాం. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

తుల (Libra): తుల రాశికి అధిపతి శుక్రుడు. ఇది శనికి మిత్ర గ్రహం. ఈ రాశిచక్రంలోని వ్యక్తులు న్యాయాన్ని  ప్రేమించేవారు, నిజాయితీపరులు మరియు కష్టపడి పనిచేసేవారు. ఈ గుణం శని దేవుడికి చాలా ఇష్టం. ఈ కారణంగా శని తులారాశి ప్రజల పట్ల దయతో ఉంటాడు. వ్యక్తి యొక్క జాతకంలో శని శుభ స్థానంలో ఉంటే.. అతడు త్వరగా పైకి ఎదుగుతాడు 


మకరం (Capicron): మకర రాశికి అధిపతి అయిన శని ఈ రాశి వారికి విశేషమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు. శనిగ్రహ ప్రభావం వల్ల మకర రాశి వారు నిరుపేదలకు సేవ చేస్తారు. వీరు కష్టపడి పనిచేస్తారు మరియు నిజాయితీ పరులు. ఈ లక్షణాల వల్ల, ఈ వ్యక్తులు జీవితంలో ఆనందంతోపాటు గౌరవాన్ని పొందుతారు. 


కుంభం (Aquarius): కుంభ రాశికి అధిపతి కూడా శని దేవుడే. కావున ఈ రాశి వారికి శనీశ్వరుని విశేష ఆశీస్సులు ఉంటాయి. పేదలు మరియు నిస్సహాయులకు సహాయం చేయడానికి..వీరు ఎప్పుడూ ముందుంటారు. వీరు మంచి నాయకులు అవుతారు మరియు జీవితంలో ఉన్నతస్థాయికి ఎదుగుతారు.  శని దయ వీరిని అనేక సమస్యల నుండి కాపాడుతుంది.


Also Read: Saturn Retrograde 2022: కుంభరాశిలో శని తిరోగమనం... ఏ రాశులకు లాభం? ఏ రాశులకు నష్టం?


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook