Lucky Stone For Get Money: ఈ రత్నాలు మీ జీవితాన్ని మార్చేస్తాయి.. వీటిని ధరించి ఏ పనులు చేసిన డబ్బే..డబ్బు..
Lucky Stone For Get Money: జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచించిన ఈ రత్నాలను ధరించడం వల్ల ఆర్థిక సమస్యల నుంచి సులభంగా ఉపశమనం పొందుతారు. ముఖ్యంగా తరచుగా అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఈ రత్నం ప్రభావంతంగా సహాయపడుతుంది. అంతేకాకుండా వీటిని ధరించడం వల్ల సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది.
Lucky Stone For Get Money: జ్యోతిష్య శాస్త్రంలో కొన్ని రత్నాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. వీటిని ధరించడం వల్ల రాశులు గ్రహాలు జాతకంలో అనుకూల స్థానంలో ఉంటాయని కొందరు నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా జీవితంలో ఆర్థిక సంక్షోభం, పనుల మధ్య ఆటంకాలు కూడా సులభంగా తొలగిపోతాయి. ప్రస్తుతం చాలామంది గ్రహదోషాల కారణంగా తీవ్ర ఇబ్బందుల బారిన పడుతున్నారు అయితే ఇలాంటి సమస్యలను ఎదుర్కొనేవారు జ్యోతిష్య శాస్త్ర సూచిస్తున్న రత్నాలను ధరించాల్సి ఉంటుంది. రత్నాల ప్రభావం జాతకాల్లో దోషాలు, గ్రహ ప్రభావాల నుంచి సులభంగా ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా ఈ రత్నాలను ధరించడం వల్ల డబ్బుకు ఎలాంటి లోటు ఉండదని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు పేర్కొన్నారు. ఏయే రత్నాలను ధరించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం..
పుష్పరాగము రత్నం:
ఈ రత్నానికి జ్యోతిష్య శాస్త్రంలో అత్యంత ప్రాముఖ్యత ఉంది. ఇది చూడడానికి పసుపు రంగులో ఉన్న మనిషి జాతకాలపై ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. రత్నాన్ని ధరించడం వల్ల సమయాల్లో కూడా డబ్బు దానంతట అదే మన దగ్గరికి చేరుతుంది. అంతే కాకుండా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి గొప్ప ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య శాస్త్రం నిపుణులు అంటున్నారు. దీన్ని ధరించిన వెంటనే ప్రభావం మనిషి జీవితంపై పడి సుఖ సంతోషాలు కలుగుతాయి.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
ఫూల్స్ గోల్డ్:
ఫూల్స్ గోల్డ్ రత్నం జీవితంపై అత్యంత ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిధులు చెబుతున్నారు. ఇది చూడడానికి అచ్చం బంగారం రంగును పోలి ఉన్న వజ్రంలా ఉంటుంది. ఈ రాయి డబ్బును వేగంగా ఆకర్షించేందుకు కీలక పాత్ర పోషిస్తుంది. తరచుగా ఆర్థిక సమస్యలతో బాధపడేవారు ఈ రత్నాన్ని ధరించడం వల్ల గొప్ప ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారాల్లో నష్టపోయేవారు ఈ ఫూల్స్ గోల్డ్ ధరించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. అంతే కాకుండా కుటుంబంలో సుఖసంతోషాలు కూడా కలుగుతాయి.
పచ్చ రత్నం:
పచ్చరత్నం ఆలోచన విధానాన్ని మెరుగుపరచడానికి కీలక పాత్ర పోషిస్తుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా గ్రహదోషాలతో బాధపడుతున్న వారికి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుందని వారంటున్నారు. పచ్చరత్నం వ్యాపారాల్లో సరైన నిర్ణయాలు తీసుకునేందుకు దోహదపడుతుంది. దీనిని ధరించడం వల్ల బుద్ధి పదముగా మారుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు. ఇంట్లో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ రత్నం కీలక పాత్ర పోషిస్తుంది. అనారోగ్య సమస్యలు రాకుండా కూడా సహాయపడుతుందని జ్యోతిష్య శాస్త్ర చెబుతున్నారు.
Also read: KIA SUV Cars: ఆ రెండు ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీలు వస్తే..క్రెటా బ్రెజాలు సర్దుకోవల్సిందేనా
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook