August Second Week Lucky Zodiac Signs 2024: ఆగస్టు రెండో వారానికి జ్యోతిష్య శాస్త్రంలో ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ సమయంలో కొన్ని ప్రత్యేకమైన గ్రహాలు సంచారం, తిరోగమనం చేయబోతున్నాయి. ఇదిలా ఉంటే ఈ సమయంలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన బుధుడు తిరోగమనం చేయబోతున్నాడు. ఈ గ్రహం సింహరాశిలో తిరోగమనం చేయబోతోంది. కాబట్టి శివయోగం ఏర్పడబోతోంది. దీని కారణంగా ఆగస్టు రెండో వారంలో మేష, వృషభ రాశితో పాటు కొన్ని రాశుల వారికి చాలా శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ శివయోగం కారణంగా ఐదు రాశుల వారు అదృష్టాన్ని పొంది కోరుకున్న కోరికలు కూడా నెరవేర్చుకుంటారు. అంతేకాకుండా అష్టైశ్వర్యాలను కూడా పొందుతారు. అయితే ఈ తిరోగమనంతో ఎక్కువ లాభాలు పొందే రాశుల వారెవరో తెలుసుకోండి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మేషరాశి: 
ఆగస్టు రెండో వారంలో మేషరాశి వారు అనేక రకాల లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయంలో వారు అనుకున్న పనుల్లో విజయాలు సాధిస్తారు. అంతేకాకుండా ఈ వారం కొన్ని మతపరమైన కార్యక్రమాల్లో కూడా పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా కొత్త గృహాలు కొనుగోలు చేసి.. గృహోపకరణాలు కూడా చేస్తారు. అంతేకాకుండా వృత్తి, వ్యాపార జీవితంలో అనుకున్న లాభాలు లాభాలు కూడా పొందుతారు. ఈ సమయంలో యువత ఎక్కువగా ఆనందంగా ఉంటారు. అలాగే ప్రభుత్వ రంగంలో పనులు చేస్తున్న ఉద్యోగులకు ఈ సమయం చాలా కలిసి వస్తుంది. దీని కారణంగా వీరు ప్రమోషన్స్ పొంది.. జీతాలు కూడా పెరుగుతాయి. అయితే మేష రాశి వారు ఈ వారంలో తప్పకుండా తీసుకునే ఆహారాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. లేకపోతే చిన్న చిన్న అనారోగ్య సమస్యల బారిన పడే ఛాన్స్ కూడా ఉంది. 


వృషభ రాశి: 
ఆగస్టు రెండో వారంలో వృషభ రాశి వారికి అనుకున్న లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వీరు ఈ సమయంలో శ్రమపడి లక్ష్యాలను సాధించేందుకు ముందుంటారు. అలాగే ఈ వార ప్రారంభంలో కొన్ని ఇబ్బందులు తలెత్తినప్పటికీ, ఆశించిన ఫలితాలు మాత్రం పొందుతారు. దీంతోపాటు పోటీ పరీక్షకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కోర్టులో ఉన్న ఆస్తి వివాదాలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. ముఖ్యంగా విదేశాల్లో ఉన్నత విద్య కోసం ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ సమయంలో వీరు విహారయాత్రలకు కూడా వెళ్లగలుగుతారు.. ఇక ఎప్పటినుంచో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఈ సమయం చాలా బాగుంటుంది. దీని కారణంగా మంచి కంపెనీల నుంచి ఆఫర్స్ కూడా పొందుతారు.


సింహరాశి: 
సింహ రాశి వారికి కూడా ఈ ఆగస్టు రెండో వారం చాలా లాభదాయకంగా ఉంటుంది. వీరు ఆశించిన విజయాలు సాధించడమే కాకుండా చిరకాల కోరికలు నెరవేర్చుకుంటారు. ఇక ఎప్పటినుంచో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వ్యక్తులకు ఈ సమయం చాలా కలిసి వస్తుంది. దీని కారణంగా వీరు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా సాధించగలుగుతారు. అలాగే గతంలో ఉన్న ఆస్తి వివాదాలన్నీ సులభంగా పరిష్కారమవుతాయి. దీంతోపాటు వీరు సామాజిక కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. ముఖ్యంగా సింహ రాశి వారికి కుటుంబ సభ్యుల సపోర్టు లభించి మంచి పనులు చేసేందుకు కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఇక మతపరమైన విషయాలపై కూడా వీరికి ఏకాగ్రత పెరిగి కొన్ని ఆలయాలను సందర్శించే ఛాన్స్ కూడా ఉంది.


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!


తులారాశి: 
తులా రాశి వారికి ఆగస్టు రెండో వారంలో ఆశించిన విజయాలను సాధించగలుగుతారు. కొన్ని పనులు చేయడం వల్ల ఈ వారం వీరు మంచి గౌరవాన్ని పొందుతారు. అలాగే ఉద్యోగాల్లో నిర్ణయాలు తీసుకునే క్రమంలో తప్పకుండా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. వీరికి ఈ సమయంలో భాగస్వామి సపోర్టు లభిస్తుంది. దీని కారణంగా ఎలాంటి పనులైన సులభంగా చేయగలుగుతారు. అలాగే తల్లిదండ్రుల సపోర్టు లభించి మధురమైన క్షణాలను గడుపుతారు. ముఖ్యంగా వీరికి ఇతరుల నుంచి ఆశించని డబ్బు కూడా వస్తుంది. దీని కారణంగా వీరి సంపాదనలో మార్పులు కూడా వస్తాయి.


ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..


ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U


ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 


TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.