Chandra Grahan 2023: మొదటి చంద్ర గ్రహంలో లాభాలు పొందే రాశులవారు వీరే, మీరు ఉంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి!
Chandra Grahan 2023 Good Effect on These 5 Zodiac Signs. 2023 చంద్ర గ్రహణ సూతకాలం భారత దేశంలో ఉండదు. అయితే ఈ చంద్ర గ్రహణం కొన్ని రాశుల వారిపై శుభప్రభావాన్ని చూపుతుంది.
Chandra Grahan 2023 Good Effect on These 5 Zodiac Signs: 2023 సంవత్సరంలో 2 సూర్య గ్రహణాలు, 2 చంద్ర గ్రహణాలు ఏర్పడబోతున్నాయి. మొదటి సూర్య గ్రహణం ఏప్రిల్ మాసంలో ఏర్పడనుండగా.. తొలి చంద్ర గ్రహణం మేలో ఏర్పడుతుంది. రెండు గ్రహణాల మధ్య కేవలం 15 రోజుల తేడా మాత్రమే ఉంది. ఈ ఏడాదిలో మొదటి చంద్ర గ్రహణం మే 5న బుద్ధ పూర్ణిమ నాడు ఏర్పడుతుంది. చంద్ర గ్రహణం రాత్రి 8:45 నుంచి మధ్యరాత్రి 1:00 గంటల వరకు ఉంటుంది. అంటే చంద్ర గ్రహణం దాదాపు 4 గంటల 15 నిమిషాల పాటు ఉంటుంది. అయితే ఈ చంద్ర గ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి చంద్ర గ్రహణ సూతకాలం మన దగ్గర ఉండదు. అయితే ఈ చంద్ర గ్రహణం కొన్ని రాశుల వారిపై చాలా శుభప్రభావాన్ని చూపుతుంది.
మిథున రాశి:
మిథున రాశి వారికి ఈ సంవత్సరంలో మొదటి చంద్ర గ్రహణం శుభప్రదం అవుతుంది. ఈ సమయంలో కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. వృత్తిలో భారీ లాభాలుంటాయి. మిథున రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతూనే ఉంటుంది. భయపడకుండా ముందుకు సాగుతారు, దాని ప్రయోజనాలను కూడా పొందుతారు.
కర్కాటక రాశి:
మే 5న బుద్ధ పూర్ణిమ నాడు ఏర్పడే చంద్ర గ్రహణం కర్కాటక రాశి వారికి చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. సమాజంలో మీపై ప్రజల ఆదరణ పెరుగుతుంది. కుటుంబ జీవితంలో కూడా ఆనందం ఉంటుంది. ఆర్ధిక సమస్యలు ఉండవు.
సింహ రాశి:
సింహరాశి వారికి చంద్ర గ్రహణం చాలా మేలు చేస్తుంది. వ్యాపారంలో ఉన్నవారు భారీ లాభాలను పొందవచ్చు. విహారయాత్రకు వెళ్లవచ్చు. మీరు మీ ఖర్చులను నియంత్రించడంలో విజయవంతవుతారు.
కన్యా రాశి:
ఈ సంవత్సరం మొదటి చంద్ర గ్రహణం కన్యా రాశి వారికి ధన లాభం కలిగిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. ఈ సమయంలో డబ్బు ఆదా అవుతుంది.
ధనుస్సు:
మే 5న చంద్ర గ్రహణం ధనుస్సు రాశి వారికి కొన్ని శుభవార్తలను అందించగలదు. మీరు గొప్ప విజయాలు సాధించగలరు. సంబంధాలు మెరుగ్గా ఉంటాయి. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు.
Also Read: Shukra Mahadasha 2023: శుక్ర మహాదశ.. 20 ఏళ్లు రాజు లాంటి జీవితం! ఇందులో మీరున్నారా
Also Read: జియో బెస్ట్ రీఛార్జ్ ప్లాన్స్.. హాట్ సమ్మర్‌లో కూల్‌గా ఐపీఎల్ 2023ని ఆస్వాదించండి! డేటా ఖతం కాదు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.