Chandra Grahan 2022 Date and Time: ఈ సంవత్సరంలో రెండవ మరియు చివరి చంద్రగ్రహణం నవంబర్ 8న దేవ్ దీపావళి రోజున (Dev Deepawali 2022) ఏర్పడనుంది. హిందూమతం మరియు జ్యోతిషశాస్త్రంలో గ్రహణం శుభప్రదంగా పరిగణించబడదు. కాగా ఈ ఏడాది కేవలం 15 రోజుల్లోనే 2 గ్రహణాలు రావడం యాదృచ్ఛికంగా జరిగింది. దీపావళి తర్వాత రోజు అంటే అక్టోబర్ 25 న సూర్యగ్రహణం ఏర్పడింది మరియు ఇప్పుడు నవంబర్ 8 న చంద్రగ్రహణం (Chandra Grahanam) సంభవించబోతోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

చంద్రగ్రహణం అంటే ఏమిటి?
చంద్రునికి సూర్యునికి మధ్యగా భూమి వచ్చినపుడు, సూర్యుని కాంతి చంద్రునిపై పడకుండా భూమి అడ్డుపడటంతో భూమిపై నున్నవారికి చంద్రుడు కనిపించడు. దీన్ని చంద్ర గ్రహణం (Lunar Eclipse) అంటారు. ఇది ఎప్పుడూ పౌర్ణమి నాడు జరుగుతుంది. వచ్చే నవంబర్ 8న కూడా ఇలాంటి ఘటనే జరగనుంది. ఈ ఏడాది తొలి చంద్రగ్రహణం మే 15న ఏర్పడింది. ఇప్పుడు ఏర్పడబోయేది రెండోది మరియు చివరది. నవంబరు 8న ఏర్పడబోయే చంద్రగ్రహణం యాదృచ్చికంగా దేవ్ దీపావళి రోజున ఏర్పడతుంది. ఈ రోజున దేవాలయాలలో ప్రత్యేక అలంకరణలు చేస్తారు.


భారతదేశంలో చంద్రగ్రహణం కనిపించనుందా? 
నవంబర్ 8న సంభవించనున్న చంద్రగ్రహణం భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో కనిపించదు. ఈ గ్రహణం నవంబర్ 8, మంగళవారం భారత కాలమానం ప్రకారం సాయంత్రం 5:32 గంటలకు ప్రారంభమై సాయంత్రం 6.18 గంటలకు ముగుస్తుంది. ఈ చంద్రగ్రహణం భారతదేశంలోని తూర్పు ప్రాంతాల్లో మాత్రమే కనిపిస్తుంది. ముఖ్యంగా కోల్‌కతా, సిలిగురి, పాట్నా, రాంచీ, గౌహతిల్లో ఈ గ్రహణం కనిపిస్తుంది. అంతేకాకుండా ఖాట్మండు, టోక్యో, మనీలా, బీజింగ్, సిడ్నీ, జకార్తా, మెల్‌బోర్న్, శాన్ ఫ్రాన్సిస్కో, వాషింగ్టన్ డీసీ, న్యూయార్క్ సిటీ, లాస్ ఏంజిల్స్, చికాగో మరియు మెక్సికో సిటీలలో కూడా చంద్రగ్రహణం కనిపిస్తుంది. 


చంద్ర గ్రహణం ప్రభావం
జ్యోతిషశాస్త్రంలో చంద్రుడిని మనస్సు మరియు తల్లికి కారకుడిగా భావిస్తారు. చంద్రగ్రహణం కారణంగా మొత్తం 12 రాశుల మానసిక స్థితి మరియు జీవితంపై శుభ మరియు అశుభ ప్రభావాలు చూపిస్తాయి. కొంతమంది చంద్రగ్రహణం సమయంలో ఒత్తిడి, అనాలోచితం, మానసిక క్షోభను ఎదుర్కోవలసి ఉంటుంది. అదే సమయంలో దాని ప్రభావం దేశం మరియు ప్రపంచంపై కూడా కనిపిస్తుంది. వాతావరణం ప్రభావం వంటి సంఘటనలు ఇందులో ఉన్నాయి. గ్రహణం వల్ల కలిగే చెడు ప్రభావాలను నివారించడానికి, గ్రహణం తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాలి.


Also Read: Guru Margi 2022: మార్గి గురువు ఎఫెక్ట్... నవంబరులో ఈరాశులవారిని వరించనున్న అదృష్టం! 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook