Guru Margi 2022: మార్గి గురువు ఎఫెక్ట్... నవంబరులో ఈరాశులవారిని వరించనున్న అదృష్టం!

Guru Margi 2022: ఆస్ట్రాలజీలో దేవగురువు బృహస్పతిని శుభగ్రహంగా భావిస్తారు. మీనరాశిలో గురుడు ప్రత్యక్ష సంచారం ఈ నాలుగు రాశులవారికి లాభాలను తెస్తుంది.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Oct 28, 2022, 09:29 AM IST
Guru Margi 2022: మార్గి గురువు ఎఫెక్ట్... నవంబరులో ఈరాశులవారిని వరించనున్న అదృష్టం!

Guru Margi in Meena rashi 2022: జ్యోతిషశాస్త్రంలో దేవగురు బృహస్పతి జ్ఞానం, సంపద మరియు పిల్లలకు కారకుడు. ఎవరి జాతకంలో కుజుడు శుభస్థానంలో ఉంటాడో ఆ వ్యక్తి అనేక విజయాలను సాధిస్తాడు. వీరి వైవాహిక జీవితం బాగుంటుంది. గత జూలై 29, 2022న బృహస్పతి మీనరాశిలో తిరోగమనం చేశాడు. అప్పటి నుంచి అదే స్థానంలో ఉన్న గురుడు నవంబరు 24న మార్గంలోకి రానున్నాడు. మీనరాశిలో బృహస్పతి ప్రత్యక్ష సంచారం (Guru Margi in Meena rashi 2022) వల్ల కొన్ని రాశులవారికి శుభఫలితాలు కలుగుతాయి. మార్గి గురువు ఏ రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో తెలుసుకుందాం. 

గురు మార్గి ఈ రాశులకు వరం
వృషభం (Taurus):
ఈరాశి వారికి బృహస్పతి ప్రత్యక్ష సంచారం చాలా శుభ ఫలితాలను ఇస్తుంది. ఆఫీసులో మీరు బాగా రాణిస్తారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. ప్రమోషన్ కు బలమైన అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు లాభాలు వస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కొత్త జాబ్ వచ్చే అవకాశం ఉంది. 
కర్కాటకం (Cancer): కర్కాటక రాశి వారికి బృహస్పతి భారీగా ధనాన్ని ఇస్తాడు. ఆదాయం పెరుగుతుంది. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. పెట్టుబడి ద్వారా లాభం ఉంటుంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. బిజినెస్ పెంచాలనుకునేవారికి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించాలనుకునే వారికి ఇదే మంచి సమయం. వైవాహిక జీవితంలో సంతోషం ఉంటుంది.
కన్య (Virgo): దేవగురువు బృహస్పతి కన్యా రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ ఇస్తారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఆర్థిక ప్రయోజనాలు లాభిస్తాయి. పాత కేసులు పరిష్కారమవుతాయి. మీరు డబ్బు కష్టాల నుండి బయటపడతారు. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది.  
వృశ్చికం (Scorpio) : వృశ్చిక రాశి వారికి మార్గి గురుడు ధనలాభాన్ని చేకూరుస్తాడు. ఆదాయం పెరుగుతుంది. చిక్కుకుపోయిన డబ్బు మీ వద్దకు వస్తుంది. వృత్తిలో లాభాలు ఉంటాయి. పదోన్నతి పొందే అవకాశాలు ఉన్నాయి. జీతంలో ఇంక్రిమెంట్ పొందవచ్చు. బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. సమాజంలో గౌరవం లభిస్తుంది.

Also Read: Surya Gochar 2022: తులరాశిలో సూర్యుడి సంచారం.. ఈ రాశులకు ప్రత్యేక ప్రయోజనం... 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.    

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu  

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News