Magh Amavasya 2023 Significance: హిందూమతంలో అమావాస్యకు చాలా ప్రత్యేకత ఉంది. ప్రతి నెల కృష్ణపక్షం చివరి రోజును అమావాస్యను పాటిస్తారు. వచ్చే ఏడాది మాఘమాసంలో వచ్చే అమావాస్య 21 జనవరి 2023 శనివారం నాడు వస్తుంది. ఇది శనివారం రావడంతో దీనిని శని అమావాస్య అని కూడా అంటారు. దీనికే మౌని అమావాస్య లేదా మాఘి అమావాస్య అని కూడా అంటారు. ఈ అమావాస్య రోజున పవిత్ర నదుల్లో స్నానం చేసి పూర్వీకులకు తర్పణాలు వదులుతారు. అంతేకాకుండా ఈ రోజున దానం కూడా చేస్తారు. ఈరోజున విష్ణువును పూజిస్తే పాపాల నుండి విముక్తి పొందడంతోపాటు గ్రహ దోషాలు తొలగిపోతాయి. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శుభ ముహూర్తం
ఈసారి మాఘ మాసంలోని అమావాస్య (Magh Amavasya 2023) తేదీ జనవరి 21, శనివారం ఉదయం 6:17 గంటలకు ప్రారంభమై జనవరి 22 ఆదివారం తెల్లవారుజామున 02:22 వరకు ఉంటుంది. మాఘ అమావాస్య రోజున స్నానం-దానం చేయడం వల్ల శుభఫలితాలు పొందుతారు. 


పూజా విధానం
అమావాస్య రోజున తెల్లవారుజామున నిద్రలేచి గంగానదిలో లేదా ఏదైనా పుణ్య నదిలో స్నానం చేయాలి. ఇది సాధ్యం కాకపోతే, ఇంట్లో స్నానం చేయండి. అనంతరం నీటితో సూర్యభగవానుడి అర్ఘ్యం సమర్పించండి. తర్వాత పారే నీటిలో నువ్వులు వేయండి. ఇప్పుడు విష్ణువును పూజించండి. ఆ దేవుడికి ధూపదీప నైవేద్యాలు సమర్పించండి.  ఈ రోజున పూర్వీకులను పూజించడం వల్ల మీకు మేలు జరుగుతుంది. తర్వాత సత్యనారాయణస్వామి వ్రత కథ వినండి. చివరికి ప్రసాదం పంచిపెట్టండి. అనంతరం దానధర్మాలు చేయండి.


Also Read: Margi Shani 2022: ఇవాళ ప్రత్యక్ష సంచారంలోకి శనిదేవుడు.. ఈ 5 రాశులవారికి కష్టాలు మెుదలు..



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook