Maha Shivaratri 2022: శివుడు సృష్టి లయకారుడు. ఒంటిపై చితాభస్మం, మెడలో నాగుపాము, పులి చర్మం ధరించి, చేతిలో ఢమరుకంతో కనిపిస్తాడు. మిగతా దేవతామూర్తుల కంటే శివుడిది పూర్తిగా భిన్నమైన ఆహార్యం. ఏ స్వార్థ, వ్యామోహం లేని విరాగి గనుకనే శివుడు ఈ అవతారంలో ఉంటాడని చెబుతారు. అందుకే ఆయన్ను సృష్టి లయకారుడిగా పిలుస్తారు. శివుడి నుదుటిపై, ఒంటిపై ఉండే చితాభస్మానికి సంబంధించి శివ పురాణంలో ఆసక్తికర కథనం ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

శివుడి ఒంటిపై బూడిద లేదా చితాభస్మం ఎందుకు ఉంటుంది?


శివ పురాణం ప్రకారం.. ఓ రుషి ఎంతో తపస్సు కారణంగా శక్తివంతంగా మారుతాడు. ఆ రుషి కేవలం ఆకులు, పండ్లు మాత్రమే ఆహారంగా తీసుకుంటాడు. ఆ రుషి పేరు ప్రణాద్. తన తపస్సు కారణంగా అడవిలోని సమస్త జీవరాశులను నియంత్రించే శక్తిని పొందుతాడు. ఒకానొక సందర్భంలో తన గుడిసెకు మరమత్తుల కోసమని దుంగలను కోస్తున్నప్పుడు.. అనుకోకుండా తన చేతి వేలికి గాయమవుతుంది.


గాయమైన ఆ చేతి వేలి నుంచి రక్తానికి బదులు.. ఒక మొక్కకు సంబంధించిన రసం కారుతుంటుంది. దీంతో తన శరీరమంతా రక్తానికి బదులు, చెట్ల రసంతో నిండిపోయిందని భావిస్తాడు. ప్రపంచంలోనే తానే అత్యంత పవిత్రమైన వ్యక్తినని నమ్ముతాడు. అందుకు చాలా గర్వపడుతాడు. ఆ రుషిని గమనించిన శివుడు అతని వద్దకు మారు వేషంలో వెళ్తాడు. ఎందుకంత సంతోషంగా ఉన్నావని అడుగుతాడు. అతను చెప్పింది విన్నాక.. మొక్కలు, చెట్లు కూడా కాలిపోయాక చివరకు మిగిలేది బూడిదేనని అతనితో అంటాడు. 


ఆ వెంటనే తన చేతి వేలిని కోసుకుని చూపిస్తాడు. అక్కడ రక్తానికి బదులు బూడిద వస్తుంది. అప్పుడు ఆ రుషికి అర్థమవుతుంది. తన ఎదుట ఉన్నది భగవంతుడు అని. అంతే.. శివుడిని ఆ రుషి క్షమాపణ కోరుతాడు. ఇక అప్పటినుంచి శివుడు తన ఒంటిపై బూడిదతోనే కనిపిస్తాడు. ఎవరైనా బాహ్య సౌందర్యాన్ని చూసి మురిసి అహంకారం ప్రదర్శించవద్దు. అంతిమ నిజమేమిటన్నది ప్రతీ ఒక్కరూ గ్రహించాలనేదే దీని సారాంశం. మహా శివరాత్రి పూట శివ పురాణాన్ని వినడం ద్వారా ఆ పరమేశ్వరుడి అనుగ్రహం పొందుతారని చెబుతారు.


Also Read: Anushka Shetty News: అమలాపాల్ మాజీ భర్తతో స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి!


Also Read: Adipurush Release Date: ప్రభాస్ ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్.. ఆదిపురుష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసింది!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook