Mahashivratri 2023 Significance: హిందువులు జరుపుకునే పండుగలలో మహాశివరాత్రి ఒకటి. ఈరోజే శివ, పార్వతులు వివాహం జరిగింది. పైగా ఈరోజు రాత్రే శివుడు తాండవం చేస్తాడు. శివపార్వతుల ఆశీస్సులు పొందడానికి ఈ రోజు చాలా ముఖ్యమైనది. ప్రతి నెలలో వచ్చే శివరాత్రిని మాస శివరాత్రి అని పిలుస్తారు. కానీ శీతకాలం చివర్లో  వేసవి కాలం ముందు వచ్చే ఫాల్గుణ మాస చతుర్దశి నాడు మహాశివరాత్రి (Maha Shivratri 2023) జరుపుకుంటారు. 2023 సంవత్సరంలో ఫిబ్రవరి 18న మహాశివరాత్రి జరుపుకోనున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

పూజా సమయం
వచ్చే ఏడాది మహాశివరాత్రి పండుగను ఫిబ్రవరి 18, శనివారం జరుపుకుంటారు. ఫాల్గుణ మాసంలోని చతుర్దశి తిథి ఫిబ్రవరి 17 రాత్రి 8:02 గంటలకు ప్రారంభమై ..ఫిబ్రవరి 18 సాయంత్రం 4:18 గంటలకు ముగుస్తుంది. పారణ సమయం...ఫిబ్రవరి 19వ తేదీ ఉదయం 06:57 నుండి మధ్యాహ్నం 3:33 గంటల వరకు.


పూజా విధానం మరియు విశిష్టత
ఈరోజు తెల్లవారుజామున నిద్రలేచి స్నానం చేయండి. అనంతరం ఉపవాసం పాటిస్తూ.. శివలింగానికి పంచామృతంతో అభిషేకం చేయండి. అనంతరం బిల్వపత్రాలను సమర్పించండి. అభిషేకం తర్వాత ఓం నమః శివాయ మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఈ విధంగా రోజంతా శివారాధనలో ఉండండి.  రాత్రి అంతా జాగరణ చేసి.. మరునాడు భోజనం చేసి ఉపవాస దీక్షను విరమించండి. ఈరోజున మహా మృత్యుంజయ మంత్రం పఠిస్తే మీకు రెట్టింపు శుభఫలితాలు కలుగుతాయి. ఈరోజున పేదలకు దానం చేయడం వల్ల మీ జీవితంలో కష్టాలన్నీ తొలగిపోయి.. సుఖ సంతోషాలు, అష్టఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. 


విదేశాల్లో మహాశివరాత్రి
మనదేశంతోపాటు ఇతర దేశాల్లో ఈ పండుగను చాలా వైభవంగా జరుపుకుంటారు. నేపాల్ లోని పశుపతినాథ్ ఆలయంలో జరుపుకునే శివరాత్రికి ప్రపంచం నలుమూలల నుండి జనాలు తరలివస్తారు. ఈరోజున భాగమతి నదిలో స్నానమాచరించి శివరాత్రి వేడుకను చేసుకుంటారు. బంగ్లాదేశ్ లో కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత ఘనంగా జరుపుకుంటారు. ఈ ఫెస్టివల్ ను మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత వైభవంగా జరుపుకుంటారు. 


Also Read: Mokshada Ekadashi 2022: మోక్షద ఏకాదశి ఎప్పుడు, శుభ సమయం, పూజా విధానం మరియు ప్రాముఖ్యతను తెలుసుకోండి



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook