Mokshada Ekadashi 2022 Date: గ్రంథాలలో ఏకాదశి వ్రతానికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ ఏకాదశి నాడు శ్రీమహావిష్ణువును (Lord Vishnu) పూజిస్తారు. మోక్షద ఏకాదశిని మార్గశిర మాసంలోని శుక్లపక్ష ఏకాదశి రోజున జరుపుకుంటారు. ఈ సారి మోక్షద ఏకాదశి డిసెంబరు 03న వస్తుంది. శాస్త్రాల ప్రకారం, మోక్షదా ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీహరిని పూజిస్తే మోక్షం పొందుతారు. మోక్షద ఏకాదశి శుభ సమయం మరియు పూజా విధానం గురించి తెలుసుకుందాం.
మోక్షద ఏకాదశి శుభ సమయం
పంచాంగం ప్రకారం, మోక్షద ఏకాదశి 03 డిసెంబర్ 2022 శనివారం ఉదయం 05.38 గంటలకు ప్రారంభమై మరుసటి రోజు డిసెంబర్ 04 ఉదయం 05.33 గంటలకు ముగుస్తుంది. ఉదయతిథి ప్రకారం డిసెంబర్ 3న మోక్షద ఏకాదశి జరుపుకుంటారు. ఉపవాసం విరమించే సమయం డిసెంబర్ 04 న మధ్యాహ్నం 01:21 నుండి 03:28 వరకు ఉంటుంది.
మోక్షద ఏకాదశి పూజా విధానం
ఈ రోజు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన బట్టలు ధరించండి. పూజా మందిరంలో పసుపు గుడ్డను పరిచి విష్ణువు ప్రతిమను ప్రతిష్టించి ఉపవాస దీక్ష తీసుకోండి. అనంతరం నెయ్యి దీపం వెలిగించి పండ్లు, స్వీట్లు, నైవేద్యాలు సమర్పించండి. అలాగే విష్ణుమూర్తికి గంగాజలంతో అభిషేకం చేయండి. మోక్షద ఏకాదశి రోజున రోజంతా ఉపవాసం ఉండి, శ్రీ హరివిష్ణువుని స్మరిస్తూ రాత్రి జాగరణ చేయండి. అంతేకాకుండా ఈ రోజు పేదలకు, బ్రహ్మణులకు దానం చేయండి.
మోక్షద ఏకాదశి ప్రాముఖ్యత
మోక్షద ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. శాస్త్రాల ప్రకారం, ఈ రోజున శ్రీ కృష్ణ భగవానుడు అర్జునుడికి గీతా సందేశాన్ని చెప్పాడు. కాబట్టి మోక్షద ఏకాదశి నాడు గీతా జయంతిని కూడా జరుపుకుంటారు. అందుకే ఈ రోజున శ్రీకృష్ణుడిని పూజించాలనే నియమం ఉంది.
Also Read: Astrology: 12 సంవత్సరాల తర్వాత అరుదైన యోగం.. ఈ రాశులకు ఊహించనంత ధనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి