MahaShivratri 2023: మహా శివరాత్రి 2023 నాడు ఈ 4 రాశుల వారికి శివుని అనుగ్రహం.. ఇందులో మీరున్నారా?
MahaShivratri 2023: మహాశివరాత్రి నాడు అరుదైన త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. దీని కారణంగా నాలుగు రాశులవారిపై మహాదేవుడు అనుగ్రహం కురిపించనున్నాడు.
MahaShivratri 2023: మహాదేవుని పూజించే అతి పెద్ద పండుగ మహాశివరాత్రి. ఈ పర్వదినం మూడు రోజుల్లో అంటే ఫిబ్రవరి 18న రానుంది. ఈరోజు శివపార్వతుల కల్యాణం జరిగిన రోజు. మహాదేవుడికి జలాభిషేకం మరియు రుద్రాభిషేకం చేయడం వల్ల మీ కోరికలన్నీ నెరవేరుతాయి. అంతేకాకుండామహాశివరాత్రి రోజు శివుని స్తుతించడం వల్ల అకాల మృత్యు భయం తొలగిపోతుంది.
ఈ సంవత్సరం మహాశివరాత్రి నాడు త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది, ఈ రోజున సూర్యుడు, శని మరియు చంద్రుడు కుంభరాశిలో కలవనున్నారు. గ్రహాల యొక్క ఈ సంయోగం వల్ల కొన్ని రాశులవారు ఉద్యోగ, వ్యాపారాల్లో మంచి లాభాలను గడించనున్నారు. మహాశివరాత్రి నాడు ఏ రాశుల వారికి అదృష్టం కలిసివస్తుందో తెలుసుకుందాం.
కుంభం - మహాశివరాత్రి నాడు కుంభరాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతోంది. ఈరాశివారు కొత్త పని ప్రారంభించడానికి ఇదే మంచి సమయం. మీరు కెరీర్‌లో పురోగతి సాధిస్తారు. బిజినెస్ విస్తరిస్తుంది. వీరిపై శివుడితోపాటు శనిదేవుని అనుగ్రహం కూడా ఉంటుంది.
మేషరాశి - మహాశివరాత్రి మేషరాశి వారికి శుభప్రదం అవుతుంది. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. మీ ఆదాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. చాలా కాలంగా నిలిచిపోయిన పనులు పూర్తవుతాయి. పూర్వీకుల ఆస్తి మీకు లాభిస్తుంది.
కర్కాటక రాశి - కర్కాటక రాశికి శివుడు దేవతగా భావిస్తారు. మహాశివరాత్రి నాడు ఈరాశివారిపై మహాదేవుడు అనుగ్రహం కురిపిస్తాడు. డబ్బు పరంగా మీరు భారీ ప్రయోజనం పొందుతారు. మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. ఉన్నతాధికారులతో సత్సంబంధాలు మెరుగ్గా ఉంటాయి.
వృషభం - భోలేనాథ్‌కి ఇష్టమైన రాశిచక్రాలలో వృషభం ఒకటి. ఈ ఏడాది శివరాత్రి రోజు వృషభ వారికి చాలా ప్రత్యేకం కానుంది. ఉద్యోగంలో పురోగతికి ఆటంకాలు తొలగిపోతాయి. మీ జీతం రెట్టింపు అవుతుంది. మీకు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి.
Also Read: Rajyog: అరుదైన రాజయోగం చేస్తున్న గురుడు.. ఈ 3 రాశులకు ప్రత్యేక ప్రయోజనం..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook