Pongal 2021 సంక్రాంతి ఆ రాష్ట్రాల్లోనూ ప్రత్యేకమే.. అక్కడా సెలబ్రేషన్స్
Makar Sankranti 2021: Places Where It Is Celebrated With Zeal: సూర్యుడిని సూర్యభగవానుడు అని పూజిస్తారు. సమస్త జీవకోటికి ఆధారం సూర్యుడు. సూర్యుడు ఏదైనా రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ప్రతి ఏడాది మనకు 12 సంక్రాంతులు వస్తాయి. అయితే మకర రాశిలోకి సూర్యడు ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం.
Makar Sankranti 2021: Places Where It Is Celebrated With Zeal: సూర్యుడిని సూర్యభగవానుడు అని పూజిస్తారు. సమస్త జీవకోటికి ఆధారం సూర్యుడు. సూర్యుడు ఏదైనా రాశిలో ప్రవేశించడాన్ని సంక్రమణము అంటారు. ఈ సంక్రమణాన్నే సంక్రాంతి అంటారు. ప్రతి ఏడాది మనకు 12 సంక్రాంతులు వస్తాయి. అయితే మకర రాశిలోకి సూర్యడు ప్రవేశించడాన్ని మనం మకర సంక్రాంతిగా జరుపుకుంటాం. మకర సంక్రాంతి ఎప్పటికీ ప్రత్యేకమే.
చెడు లక్షణాలు తొలగిపోయి మంచి మొదలయ్యే సమయం ఇది. శారీరక శ్రమకు, పూజలకు, సాధనలకు, కృషికి అనువైన, ఆవశ్యకత ఉన్న కాలాన్ని ఉత్తరాయణం అంటారు. మకర సంక్రాంతి(Pongal 2021)తో పండుగ వాతావరణం నెలకొంటుంది. మకర సంక్రమణము నుండి ఉత్తరాయణ కాలం ప్రారంభం అవుతుంది. కుంభ, మీన, మేష,వృషభ, మిథున రాశుల వరకు ఉత్తరాయణం కొనసాగుతుంది. దేవతలు మేలుకుని ఉండే కాలమే కాలము ఈ ఉత్తరాయణం.
Also Read: Pongal 2021 Date, Time: మకర సంక్రాంతి తేదీలు, ముహూర్తం.. పండుగ ప్రాముఖ్యత
దానాలు చేయడం వల్ల ఇతర కాలాల్లో చేసే దానాల కన్నా అధిక పుణ్యఫలం దక్కుతుంది. పితృ దేవతలకు ఈ సమయంలో తర్పణాలిస్తే ఈ ఏడాది వచ్చే అన్ని సంక్రాంతులకు వారికి తర్పణం ఇచ్చినట్టేనని పెద్దలు చెబుతారు. అయితే సంక్రాంతి పండుగను ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలతో పాటు పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మరియు గుజరాత్ రాష్ట్రాలలోనూ జరుపురుకుంటారు.
పంజాబ్(Punjab)లో మకర సంక్రాంతి పండుగను లోహ్రీ లేక బాఘీ అని పిలుస్తారు. చలిమంటలు వేసి శీతకాలానికి వీరు స్వస్తి పలుకుతారు. రబీ సీజన్ పంట చేతికొచ్చే కాలం కనుక సంక్రాంతిని జరుపుకుంటారు.
Also Read: Srisailam Brahmotsavam: ఘనంగా ప్రారంభమైన మకర సంక్రాంతి బ్రహ్మోత్సవాలు
ఉత్తరప్రదేశ్‌లో మకర సంక్రాంతిని ‘ఖిచిరి’ అని సెలబ్రేట్ చేసుకుంటారు. సంక్రాంతి సమయంలో దాదాపు ఒకనెల పాటు అలహాబాద్‌లో మాఘ మేళా నిర్వహిస్తారు. సంప్రదాయ స్నానాలు, ఇతర కార్యక్రమాలు చేస్తారు.
పశ్చిమ బెంగాల్‌లో గంగా సాగర్ సమీప ప్రాంతాలలో పండుగ వాతావరణం కనిపిస్తుంది. సూర్యభగవానుడికి పూజలు చేస్తూ వేడుకను జరుపుకోవడం ఇక్కడ ఆనవాయితీ.
స్నేహితులు, బంధువులు, సన్నిహితులకు పరస్పరం బహుమతులు ఇచ్చిపుచ్చుకుని గుజరాత్ ప్రజలు సంక్రాంతి పండుగను జరుపుకుంటారు. గాలిపటాలు కూడా ఎగరవేస్తారు.
Also Read: Chandrababu Naidu: భోగి వేడుకల్లో చంద్రబాబు.. జీవో ప్రతుల దహనం
తమిళనాడు(Tamil Nadu)లోనూ తెలుగు రాష్ట్రాల తరహాలోనే నాలుగు రోజులపాటు మకర సంక్రాంతి జరుపుకుంటారు అయితే మన దగ్గర సంక్రాంతి అంటాము, తమిళనాడులో పొంగల్ అని పిలుస్తారు. పంటలు చేతికొచ్చే సమయం కనుక ప్రకృతిని పూజిస్తారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook