Ayyappa Jyothi 2023: మకర జ్యోతి దర్శనం ఎప్పుడో తెలుసా.. దర్శించుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు ఇవే..
Makara Jyothi 2023 Date And Time: ప్రతి సంవత్సరం శబరిమల అయ్యప్ప స్వామి జ్యోతి రూపంలో దర్శనమిస్తారని ప్రజల నమ్మకం. అయితే ఈ సంవత్సరం కూడా భక్తులకు జ్యోతి దర్శనం ఇవ్వనుంది. ఈ క్రమంలో భక్తులంతా ఎంతో భక్తి శ్రద్ధతో అయ్యప్పను పూజిస్తారు.
Makara Jyothi 2023 Date And Time: ఈరోజు సూర్యుడు మకర రాశిలోకి సంచారం. కాబట్టి నేటి నుంచే దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు మొదలయ్యాయి. కొన్ని చోట్ల ఈ రోజు నుంచే మకర సంక్రాంతి జరుపుకుంటారు. అయితే మరికొన్ని చోట్ల మాత్రం మాత్రం జనవరి 15న అంటే రేపు సంక్రాంతిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితిగా వస్తోంది. అయితే ఇదే క్రమంలో శబరిమల అయ్యప్ప దేవుడి మకరజ్యోతి కూడా భక్తులకు దర్శనం ఇవ్వనుంది. అయితే ఈ సంవత్సరం మకరజ్యోతి ఎప్పుడు దర్శనమిస్తుందో తెలుసుకుందాం..
శబరిమల ఆలయాన్ని మకరజ్యోతి దర్శనం రోజున లక్షలాది మంది అయ్యప్ప భక్తులు సందర్శిస్తారు. అయితే ఈ సంవత్సరం 14 జనవరి మకర జ్యోతి కనిపించే అవకాశాలున్నాయి. ఇకపై శబరిమల ఆలయాన్ని సందర్శించలేని వారు ఆన్‌లైన్ లైవ్ స్ట్రీమ్, మకరవిళక్కు ఉత్సవ్ ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కూడా చూడోచ్చు. అయితే ఈ జ్యోతి దర్శించుకోవడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో తెలుసుకుని ప్రయత్నం చేద్దాం..
మకర సంక్రాంతి 2023 తేదీ, సమయం:
సూర్యుడు మకర రాశిలోకి సంచారం చేయడం వల్ల వ్యక్తుల జీవితాల్లో చాలా రకాల మార్పులు సంభవిస్తాయి. అయితే ఇదే క్రమంలో శుభ సమయాలు కూడా మొదలవుతాయి. ఇదే క్రమంలో అయ్యప్ప భక్తులు పెద్ద సంఖ్యలో మాలలు వేసుకోవడం వల్ల అయ్యప్ప జ్యోతి రూపంలో దర్శనమిస్తారని ప్రజల నమ్మకం. అయితే పంచాగం ప్రకారం జనవరి 14న అయ్యప్ప జ్యోతి కనిపించనుంది. సాయంత్రం 6 నుంచి 8 గంటల మధ్య ఈ జ్యోతి కనిపిస్తుందని ఆలయ అధికారులు తెలుపుతున్నారు.
మకర జ్యోతి ప్రాముఖ్యత:
ప్రతి సంవత్సరం మకర జ్యోతి కనిపిస్తుంది. అయితే అక్కడి ప్రజలు దీనినే మకరవిళక్కు వార్షిక పండుగ అని అంటారు. ఈ వార్షిక ఉత్సవాల్లో భక్తులంతా పాల్గొని ఎంతో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామిని స్మరించుకుంటారు. ఈ జ్యోతిని దర్శించుకోవడం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయని పూర్వీకుల నమ్మకం.. అందుకే ప్రతి సంవత్సరం భక్తులు పెద్ద ఎత్తు స్వామి వారిని పూజా కార్యక్రమాలు చేసి జ్యోతిని దర్శించుకుంటారు.
ఇది కూడా చదవండి : Aadhaar Card Important News: మీ ఆధార్ కార్డ్ లాక్ లేదా అన్‌లాక్ చేసుకోండిలా
ఇది కూడా చదవండి : Tata Punch Car Insurance: టాటా పంచ్ కారును ఇన్సూరెన్స్ కోసం ఓనర్ ఏం చేస్తున్నాడో చూడండి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook