Malavya Rajyog: 2023లో శుక్రుడు ఈ 3 రాశులవారికి అంతులేని ఐశ్వర్యాన్ని ఇవ్వనున్నాడు..!
Malavya Rajyog: ఐశ్వర్యాన్ని ఇచ్చే శుక్రుడు కొత్త ఏడాదిలో మాళవ్య రాజయోగాన్ని సృష్టిస్తున్నాడు. ఈ యోగం మూడు రాశులవారికి శుభప్రదంగా ఉండనుంది.
Shukra Gochar Malavya Rajyog: జ్యోతిష్యశాస్త్రంలో గ్రహల రాశి మార్పుకు చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఎందుకంటే ఈ గ్రహాల గమనంలోని చేంజ్ ప్రతి ఒక్కరిపై పెను ప్రభావాన్ని చూపుతుంది. శుక్రగ్రహం 15 ఫిబ్రవరి 2023న మీనరాశిలో సంచరించనున్నాడు. ప్రేమ, శృంగారం, ఐశ్వర్యం మరియు లగ్జరీ లైఫ్ కు శుక్రుడు కారకుడు. శుక్రుడి రాశి మార్పు కొందరికి శుభప్రదంగానూ, మరికొందరికి అశుభంగానూ ఉంటుంది. మీనరాశిలో శుక్ర సంచారం కారణంగా అరుదైన 'మాళవ్య రాజయోగం' ఏర్పడుతుంది. దీని కారణంగా మూడు రాశులవారు ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు.
మిథునరాశి (Gemini): మాళవ్య రాజయోగం వల్ల మిథున రాశి వారికి ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆఫీసులో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. మీ వర్క్ పట్ల మీ బాస్ సంతోషిస్తాడు. ఉద్యోగులకు ప్రమోషన్, ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే అవకాశం ఉంది.
కన్య రాశి (Virgo): మాళవ్య రాజ్యయోగం వల్ల కన్యా రాశి వారికి ఆర్థిక ప్రయోజనం చేకూరుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. అవివాహితులకు పెళ్లి జరిగే అవకాశం ఉంది. పార్టనర్ షిప్ తో వ్యాపారం ప్రారంభించండి. పెండింగ్ లో ఉన్న పనులన్నీ పూర్తవుతాయి. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది.
ధనుస్సు రాశి (Sagittarius): కొత్త సంవత్సరంలో ధనుస్సు రాశి వారికి వాహన మరియు ఆస్తి ఆనందాన్ని పొందవచ్చు, ఎందుకంటే శుక్ర సంచారం వల్ల ఏర్పడిన మాళవ్య రాజ్యయోగంతో ధనుస్సు రాశివారికి మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఈరాశి వారికి తల్లి మద్దతు లభిస్తుంది. ఉద్యోగస్తులు కొత్త జాబ్ లభించే అవకాశం ఉంది. వ్యాపారులు తమ బిజినెస్ ను విస్తరింపజేస్తారు.
Also Read: Sankranti Festival: 2023లో సంక్రాంతి ఎప్పుడు వచ్చింది? ఈ పండుగ విశిష్టత ఏంటి?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook.